Site icon NTV Telugu

Sanae Takaichi: జపాన్‌లో ఐరన్ లేడీ సనాయే తకైచి చారిత్రాత్మక విజయం.. అభినందనలు తెలిపిన ప్రధాని మోడీ

Sanae Takaichi

Sanae Takaichi

జపాన్ చరిత్రలో మొదటిసారిగా మహిళ ప్రధాన మంత్రిగా ఎన్నికైన సనాయే తకైచి, తన పదవీకాలంలోనే జరిగిన స్నాప్ ఎన్నికల్లో భారీ విజయం సాధించారు. ఆమె నేతృత్వంలోని లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (LDP) శనివారం జరిగిన శీతాకాల సాధారణ ఎన్నికల్లో (ఫిబ్రవరి 8, 2026) లోయర్ హౌస్‌లో సూపర్ మెజారిటీ సాధించింది. ఇది జపాన్ రాజకీయాల్లో ఒక చారిత్రక మలుపుగా నిలిచింది.

Also Read:Bhagwant Mann: పంజాబ్ సీఎంకు చుక్కెదురు.. భగవంత్ మాన్ విదేశీ టూర్‌కు కేంద్రం నిరాకరణ

పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ NHK ప్రకారం, 465 సీట్ల హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో LDP ఒక్కటే 316 సీట్లు గెలుచుకుంది. ఇది సాధారణ మెజారిటీకి (233 సీట్లు) మించిన సంఖ్య. రెండు-మూడవ వంతుల సూపర్ మెజారిటీ (సుమారు 310 సీట్లు) సాధించడం ద్వారా, LDP ఒక్కటే అప్పర్ హౌస్‌ను ఓవర్‌రైడ్ చేసే అధికారం పొందింది. LDP మిత్రపక్షమైన జపాన్ ఇన్నోవేషన్ పార్టీ (JIP)తో కలిపి మొత్తం 352 సీట్లు సాధించింది. ఇది రెండవ ప్రపంచ యుద్ధానంతర జపాన్ చరిత్రలో ఒకే పార్టీకి లభించిన అతిపెద్ద విజయం. 2017లో షింజో అబే నేతృత్వంలో LDP సాధించిన రికార్డును కూడా మించింది.

2025 అక్టోబర్ 21న జపాన్ మొదటి మహిళ ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తకైచి, కేవలం 110 రోజుల్లోనే లోయర్ హౌస్‌ను డిసాల్వ్ చేసి స్నాప్ ఎన్నికలు ప్రకటించారు. ఇది ఒక పెద్ద రిస్క్‌గా భావించాయి రాజకీయ వర్గాలు. “ప్రజల మండేట్ లేకుండా పాలన కొనసాగించడం సరికాదు” అని తకైచి చెప్పారు. ఎన్నికల్లో ఓడిపోతే రాజీనామా చేస్తానని కూడా ప్రకటించారు. కానీ ఆమె గ్యాంబుల్ సక్సెస్ అయింది. ఆర్థిక సంస్కరణలు, ఇమ్మిగ్రేషన్‌పై కఠిన వైఖరి, చైనాతో సంబంధాల్లో బలమైన స్టాండ్ వంటి ఆమె అజెండాకు ప్రజలు భారీ మద్దతు తెలిపారు. యువతలో “సనామానియా” అనే ట్రెండ్ కూడా ఆమెకు బూస్ట్ ఇచ్చింది.

64 ఏళ్ల తకైచి, కన్జర్వేటివ్ రాజకీయ నాయకురాలు. బ్రిటన్ మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్‌ను ఆదర్శంగా తీసుకున్నారు. ఆమెను “జపాన్ ఐరన్ లేడీ” అని పిలుస్తున్నారు. రక్షణ ఖర్చులు పెంచడం, చైనాతో బలమైన వైఖరి, ఇమ్మిగ్రేషన్ నియంత్రణ, ఆర్థిక విధానాల్లో టాక్స్ కట్లు వంటివి ఆమె ప్రధాన ఎజెండాలు.ఈ విజయంతో ఆమె ప్రభుత్వం మరింత బలపడింది. డిఫెన్స్ బిల్డప్, ఆర్థిక సంస్కరణలు సులభంగా అమలు చేయవచ్చు. అయితే, ఫైనాన్షియల్ మార్కెట్లు టాక్స్ కట్లు, ఖర్చుల పెంపు వల్ల కొంత ఆందోళన చెందుతున్నాయి.

ఈ ఎన్నికల ఫలితం ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో జపాన్ బలమైన స్థానాన్ని సూచిస్తుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆమె అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన నేపథ్యంలో, జపాన్-అమెరికా సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉంది. సనాయే తకైచి ఈ విజయంతో జపాన్‌ను “బలమైన, స్వతంత్ర” దేశంగా తీర్చిదిద్దాలనే తన విజన్‌ను మరింత ధీమాగా అమలు చేయనున్నారు. జపాన్ రాజకీయాల్లో ఈ చారిత్రక విజయం దశాబ్దాల పాటు ప్రభావం చూపనుంది.

Also Read:IND vs PAK: భారత్- పాక్ మ్యాచ్‌కు గ్రీన్ సిగ్నల్?.. కానీ 3 కండీషన్స్ పెట్టిన పాకిస్థాన్

మీ మైలురాయి విజయానికి సానే తకైచికి అభినందనలు. మన భారత్-జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, గ్లోబల్ భాగస్వామ్యం ప్రపంచ శాంతి, స్థిరత్వం, సమృద్ధిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మీ సమర్థ నాయకత్వంలో, భారత్-జపాన్ స్నేహాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం కొనసాగుతుందని నేను విశ్వసిస్తున్నాను అని Xలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు.

Exit mobile version