Site icon NTV Telugu

Samsung TV Outage: సామ్ సంగ్ స్మార్ట్ టీవీ సేవలు డౌన్.. స్పందించని కంపెనీ

Samsung

Samsung

ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సామ్ సంగ్ కంపెనీకి చెందిన స్మార్ట్ టీవీ సేవలు నిలిచిపోయాయి. చాలా మంది యూజర్లు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లేదా డౌన్ డిటెక్టర్ లో ప్రపంచవ్యాప్తంగా కస్టమర్లు సామ్ సంగ్ టీవీ రెండు ప్లాట్‌ఫామ్‌లలో పనిచేయడం లేదని ఫిర్యాదు చేస్తున్నారు. డౌన్ డిటెక్ట్ ప్లాట్‌ఫామ్‌లో 2500 మందికి పైగా వ్యక్తులు Samsung TV పనిచేయడం లేదని ఫిర్యాదు చేశారు. దాదాపు 80 శాతం మంది కస్టమర్లు దీనిలోని యాప్‌లను యాక్సెస్ చేయలేకపోతున్నామని చెబుతున్నారు.

Also Read:IND- US Defense Deals: ట్రంప్ టారిఫ్ వివాదం.. F-35 డీల్‌కు భారత్ బ్రేక్స్..?

అదే సమయంలో, 13 శాతం మంది లాగిన్ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య ఎందుకు సంభవిస్తుందో.. టీవీ పనిచేయకపోవడానికి గల కారణాన్ని సామ్ సంగ్ అధికారికంగా తెలియజేయలేదు. సామ్ సంగ్ టీవీ వినియోగదారులు తమ స్మార్ట్ టీవీలో ఏ యాప్‌ను ఓపెన్ చేయలేకపోతున్నారని ఫిర్యాదు చేస్తున్నారు. చాలా మంది Netflix, Peacock, YouTube TV లను యాక్సెస్ చేయలేకపోతున్నారు. భారత్ లో కూడా చాలా మంది వినియోగదారులు ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు.

Also Read:Uttarakhand: 5 ఆస్పత్రుల నిర్లక్ష్యం.. ఏడాది బాలుడు మృతి.. ముఖ్యమంత్రి ఆగ్రహం

ఈ ప్రభావం అమెరికన్ వినియోగదారులపై ఉంది. ఏదైనా యాప్ ఓపెన్ చేసినప్పుడు, ‘సర్వర్ నిర్వహణలో ఉంది’ అనే సందేశం కనిపిస్తుందని కస్టమర్లు కంప్లైంట్ చేస్తున్నారు. సామ్ సంగ్ సర్వర్ డౌన్ అయినందున ఈ రాత్రి టీవీ కూడా చూడలేకపోతున్నాను’ అని ఒక యూజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఐదేళ్ల నాటి టీవీ స్థానంలో కొత్త సామ్ సంగ్ టీవీ కొన్నాను, కానీ సర్వర్ డౌన్ అయిందని తెలిపాడు.

Exit mobile version