NTV Telugu Site icon

Samsung Mobile : శాంసంగ్ నుంచి మరో రెండు ట్యాబ్లెట్లు.. ఫీచర్స్, ధర?

Samsung

Samsung

ఈ ఫెస్టివల్ ను మరింత ఆనందంగా జరుపుకోవడానికి కొన్ని ప్రముఖ మొబైల్స్ కంపెనీలు కొత్త స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తున్నారు.. తాజాగా శాంసంగ్ కంపెనీ కొత్త ట్యాబ్లెట్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు.. టెక్ దిగ్గజం శామ్సంగ్ తన సరికొత్త గెలాక్సీ ట్యాబ్ ఏ9 మరియు గెలాక్సీ ట్యాబ్ ఏ9 ప్లస్ లను మన దేశంలో ఆవిష్కరించింది. ఈ రెండు టాబ్లెట్‌లు ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ లో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్‌2023ను మొదలు పెట్టింది.. ఈ క్రమంలో ఈ ట్యాబ్ లను కూడా విడుదల చేసింది..

ట్యాబ్స్ కు మార్కెట్ లో డిమాండ్ ఎక్కువగా.. దాంతో కంపెనీలు కూడా కొత్త కొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొని వస్తున్నాయి..విద్యార్థులు ఎక్కువగా ట్యాబ్లెట్లు వినియోగిస్తున్నారు. దీంతో ప్రతి ఇంట్లో ట్యాబ్లెట్ అవసంరం అవుతోంది. ఈ క్రమంలో తల్లిదండ్రులు కూడా తక్కువ ధరలో బెస్ట్ బ్రాండ్, టాప్ స్పెసిఫికేషన్లు ఉన్న ట్యాబ్లెట్లను వెతుకుతున్నారు. ఈ క్రమంలో శామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ9, ఏ9 ప్లస్ లను తాజాగా మన దేశంలో లాంచ్ చేసింది.. ఈ ఫోన్ ఫీచర్స్ ధర గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

గెలాక్సీ ట్యాబ్ ఏ9 ధర 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వైఫై ఓన్లీ వేరియంట్‌ రూ. 12,999గా ఉంది. అలాగే వైఫై ప్లస్ 5జీ వేరియంట్‌ ధర రూ.15,999గా ఉంది. అదే విధంగా గెలాక్సీ ట్యాబ్ ఏ9 ప్లస్ ట్యాబ్లెట్ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వైఫై ఓన్లీ వేరియంట్ ధర రూ. 20,999గా ఉంది.. గ్రే, బ్లూ,డార్క్ బ్లూ, సిల్వర్ కలర్ అందుబాటులో ఉంది..

800 x 1,340 పిక్సల్స్ రిజల్యూషన్, 60హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో 8.7-అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లేను కలిగి ఉంది. ట్యాబ్‌లో ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఉంటుంది. మీడియా టెక్ హీలియో జీ99 చిప్‌సెట్, 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ ఉన్నాయి. ఇది మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్‌ను కలిగి ఉంది. అందువల్ల స్టోరేజ్ మరింత విస్తరించదగినది. 2ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 8ఎంపీ వెనుకవైపు ఉంటాయి..

గెలాక్సీ ట్యాబ్ ఏ9 ప్లస్ ఫీచర్స్ చూస్తే..1,200 x 1,920 పిక్సల్స్ రిజల్యూషన్, 90హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో 11-అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లే ఉంటుంది. ఈ ట్యాబ్ లో కూడా ఆండ్రాయిడ్ 13, వన్ యూఐ 5.1 ఓఎస్ ప్లాట్ ఫారం ఉంటుంది. క్వాల్ కామ్ ఎస్ఎం6375 స్నాప్ డ్రాగన్ 695 5జీ చిప్ సెట్ ఆధారంగా పనిచేస్తుంది. ఇక 8జీబీ ర్యామ్,128జీబీ స్టోరేజ్ వేరియంట్లో అందుబాటులో ఉంటుంది. మైక్రో ఎస్డీ కార్డు ద్వారా మెమరీని ఎక్స్ పాండ్ చేసుకోవచ్చు. ఈ ట్యాబ్ లో 5ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది.. కెమెరా ప్రియులకు ఇది బెస్ట్ ఇక బ్యాటరీ సామర్థ్యం ఫాస్ట్ చార్జింగ్ 7040 ఎంఏహెచ్ బ్యాటరీనినీ కలిగి ఉంది.