NTV Telugu Site icon

Samsung Galaxy Fit3: ఫిట్‌నెస్ కోసం అద్భుత స్మార్ట్‌వాచ్.. శాంసంగ్‌ గెలాక్సీ ఫిట్‌ 3 ప్రత్యేకతలు ఇవే!

Samsung Galaxy Fit3 Price

Samsung Galaxy Fit3 Price

Samsung Galaxy Fit3 Price and Battey: ప్రస్తుతం అందరూ ఉరుకులు, పరుగుల జీవనం కొనసాగిస్తున్నారు. ప్రతి పనికి మెషీన్లు రావడంతో శారీరక శ్రమ అవసరమే లేకుండా పోయింది. దాంతో చాలామంది త్వరగా అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఫిట్‌నెస్ కోసం ఎక్స్‌ర్‌సైజ్‌, వాకింగ్, యోగా తప్పనిసరి అయ్యాయి. ఎక్స్‌ర్‌సైజ్‌, వాకింగ్, యోగా చేయడం మాత్రమే కాదు.. వాటిని ట్రాక్ చేసుకోవడం కూడా చాలా మందికి బాగా అలవాటైంది. అందుకోసం స్మార్ట్‌వాచ్‌లు బాగా ఉపయోగపడుతున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని హెల్త్, ఫిట్‌నెస్ ట్రాకర్స్ ఉన్న స్మార్ట్‌వాచ్‌లను పలు కంపెనీలు లాంచ్ చేస్తున్నాయి. ఇందులో ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ శాంసంగ్‌ దూసుకుపోతుంది.

శాంసంగ్‌ తన కొత్త ఫిట్‌నెస్‌ ట్రాకర్‌ ‘గెలాక్సీ ఫిట్‌ 3’ని భారత దేశంలో విడుదల చేసింది. 2020లో విడుదల చేసిన ‘గెలాక్సీ ఫిట్‌ 2’ కంటే దీనిలో ఎక్కువ ప్రత్యేకతలు ఉన్నాయి. గెలాక్సీ ఫిట్‌ 3 ట్రాకర్‌ ధర రూ.4,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ స్మార్ట్‌వాచ్ మూడు ఆకర్షణీయమైన రంగుల్లో (గ్రే, పింక్‌ గోల్డ్‌, సిల్వర్‌) అందుబాటులో ఉంది. శాంసంగ్‌ అధికార వెబ్‌సెట్‌తో పాటు ఇతర ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ స్టోర్‌లలో ఇది అందుబాటులో ఉంటుంది.

Also Read: KL Rahul: లండన్‌కు కేఎల్‌ రాహుల్‌.. ఐదో టెస్టుకు కూడా దూరం!

శాంసంగ్‌ గెలాక్సీ ఫిట్‌ 3 స్క్రీన్‌ 1.6 అంగుళాలు ఉంటుంది. దాంతో డిస్‌ప్లే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్కసారి చార్జింగ్‌ చేస్తే.. 13 రోజుల వరకూ బ్యాటరీ పనిచేస్తుంది. దీంతో తరచూ చార్జింగ్‌ చేసే పని ఉండదు. 5 ఏటీఎం, ఐపీ 68తో ప్రత్యేకంగా దీనిని రూపొందించారు. దాంతో ఇందులోకి నీరు, దుమ్ము చేరవు. దాదాపుగా వందకు పైగా వర్కౌట్లకు ఇది సపోర్టు చేస్తుంది. హార్ట్ బీట్, పల్స్ రేట్, శరీరంలో ఆక్సిజన్ స్థాయి వంటివి ఎన్నో దీని ద్వారా తెలుసుకోవచ్చు. కెమెరా, టైమర్‌, మీడియా ప్లేబ్యాక్‌ వంటి స్మార్ట్‌ ఫోన్‌ ఆప్షన్లను సులభంగా ఆపరేట్ చేయవచ్చు. గెలాక్సీ ఫిట్‌ 3తో అత్యవసర సేవలకు కాల్ చేసే అవకాశం కూడా ఉంది.