రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్‌ప్లే శాంసంగ్ అందుబాటులోకి..

Samsung

Samsung

శాంసంగ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను తక్కువ ధరకే సొంతం చేసుకోవాలనుకునే వారికి ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్ అదిరిపోయే అవకాశాన్ని కల్పిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ S25 FE స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ.14,500 భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. భారతదేశంలో ఈ ఫోన్ లాంచ్ ధర రూ.59,999 కాగా, ప్రస్తుతం అమెజాన్‌లో రూ.45,499 కే కొనుగోలు చేయవచ్చు. దీనికి అదనంగా అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేస్తే రూ.1,364 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అదే కార్డ్‌పై నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటే వడ్డీ రూపంలో రూ.1,186 వరకు ఆదా చేసుకోవచ్చు. ఇంకా పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా గరిష్టంగా రూ.30,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందే అవకాశం కూడా ఉంది.

ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్, 2,600 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో కూడిన 6.7-ఇంచుల Full HD+ Dynamic AMOLED 2X డిస్‌ప్లేను అందించారు. స్క్రీన్ రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+ సపోర్ట్ ఉంది. రోజువారీ పనులు, మల్టీటాస్కింగ్ , హై-ఎండ్ గేమింగ్ కోసం ఇందులో శక్తివంతమైన ఎక్సినోస్ 2400 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది 8GB RAM తో పాటు 128GB, 256GB , 512GB స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే, 4,700mAh సామర్థ్యం గల బ్యాటరీతో పాటు 45W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మరియు 15W వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉంది.

కెమెరా విభాగంలో ఈ ఫోన్ అద్భుతమైన ప్రదర్శన ఇస్తుంది. ఇందులో OIS సపోర్ట్‌తో కూడిన 50MP ప్రధాన కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ కెమెరా మరియు 3x ఆప్టికల్ జూమ్ కలిగిన 8MP టెలిఫోటో కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీల కోసం 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేసే 12MP ఫ్రంట్ కెమెరాను అందించారు. ముఖ్యంగా ఈ ఫోన్ సర్కిల్ టు సెర్చ్, లైవ్ ట్రాన్స్‌లేట్, ఇంటర్‌ప్రెటర్, నోట్ అసిస్ట్, రైటింగ్ అసిస్ట్, ఫోటో అసిస్ట్, ఆబ్జెక్ట్ ఎరేజర్ మరియు ఆడియో ఎరేజర్ వంటి అధునాతన గెలాక్సీ ఏఐ (Galaxy AI) ఫీచర్లతో వస్తుంది. అంతేకాకుండా, దీనికి IP68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ కూడా ఉంది.