Site icon NTV Telugu

Supreme Court: అక్టోబర్ 17 నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్

Supreme Court

Supreme Court

Supreme Court: స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టపరమైన గుర్తింపు ఇవ్వడానికి అక్టోబర్ 17న సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇప్పుడు ఈ నిర్ణయంపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌లో భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయాన్ని సవాలు చేశారు. ఈ పిటిషన్‌లో స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టపరమైన గుర్తింపు నిరాకరించబడిన అక్టోబర్ 17 నాటి నిర్ణయాన్ని సమీక్షించాలని అభ్యర్థించారు. ఉదిత్ సూద్ అనే వ్యక్తి ఈ రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు.

Read Also:Anjan Kumar Yadav : కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగింది

అక్టోబరు 17న ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టపరమైన గుర్తింపు ఇవ్వడానికి నిరాకరించింది. దీనితో పాటు ఈ విషయంలో చట్టాలు చేయడం పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీల పని అని కూడా కోర్టు పేర్కొంది. స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టపరమైన గుర్తింపు ఇవ్వాలని కోరుతూ దాఖలైన 21 పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనం విచారించింది. అయితే, ఈ సమయంలో గే కమ్యూనిటీ పట్ల వివక్ష చూపకుండా చూడాలని ప్రధాన న్యాయమూర్తి కేంద్రం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించారు.

Read Also:Vikram: శివపుత్రుడు లానే తంగలాన్ లో కూడా నాకు డైలాగ్స్ ఉండవు

స్వలింగ సంపర్క వివాహాలకు చట్టపరమైన గుర్తింపు ఇవ్వాలన్న డిమాండ్‌పై ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 3-2 తీర్పును వెలువరించింది. అక్టోబర్ 17న జరిగిన విచారణలో సీజేఐ, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ఒకవైపు ఉండగా, జస్టిస్ భట్, జస్టిస్ కోహ్లీ, జస్టిస్ నరసింహులు మరోవైపు ఉన్నారు. అయితే, ఐదుగురు న్యాయమూర్తులు దీనిని పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర కమిటీని కోరారు. గే వివాహం గుర్తించబడలేదు. ప్రత్యేక వివాహ చట్టంలో మార్పులు చేసే హక్కు పార్లమెంటుకు మాత్రమే ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. స్వలింగ సంపర్కులు కలిసి జీవించవచ్చు, కానీ వివాహాన్ని చేసుకున్నా అది గుర్తించబడదు.

Exit mobile version