Site icon NTV Telugu

Samantha: ‘ప్రేమ’ గురించి సమంత కీలక ప్రకటన?

Samantha

Samantha

Samantha to announce something Special Today: సమంత, నాగచైతన్య ఒకప్పుడు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వారి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ మూడేళ్ల క్రితం విడిపోయారు. విడిపోయినప్పటి నుంచి తప్పు ఎవరిది అనే అంశం మీద చర్చలు జరుగుతూనే ఉన్నాయి. నాగచైతన్య అభిమానులు తప్పు సమంతదేనని సమంత అభిమానులు, తప్పు నాగచైతన్యదని రకరకాల కామెంట్లు చేస్తూ వస్తున్నారు. కానీ అది వారి వ్యక్తిగత విషయం. అయితే నాగచైతన్య శోభితతో నిశ్చితార్థం చేసుకున్న తర్వాత ఈ అంశం గురించి మళ్లీ చర్చిలు మొదలయ్యాయి. మరో పక్క సమంత ఏకంగా ఒక డైరెక్టర్ తో డేటింగ్ చేస్తోందని కాదు కాదు ఏకంగా నిశ్చితార్థం కూడా జరిగిపోయిందని రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే ఇలాంటి సమయంలోనే సమంత తన సోషల్ మీడియా వేదికగా పెడుతున్న పోస్టులు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

Kiran Abbavaram: హీరోయిన్ తో కిరణ్ అబ్బవరం పెళ్లి.. ఎప్పుడు? ఎక్కడంటే?

ఆమె వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించి ఈ పోస్టులు పెడుతుందా? లేక ఆమె చేస్తున్న పలు బిజినెస్లకి సంబంధించిన పోస్టులు పెడుతుందా అనే విషయం మీద అయితే చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ఆమె ఒక ఇంస్టాగ్రామ్ స్టోరీ పెట్టింది. అందులో ఈరోజు కొంచెం స్పెషల్ మీ ముందుకు రాబోతోంది స్టేట్ ట్యూన్ అంటూ రాసుకొచ్చింది. కింద వాడిపోయిన ఆకులకు సంబంధించిన ఒక ఫోటో కూడా పెట్టడం అనేక చర్చలకు తావిస్తోంది. ఆమె తన బిజినెస్ అప్డేట్ ఏదైనా ఇస్తోందా? లేక పర్సనల్ లైఫ్ అప్డేట్ ఏమైనా ఇస్తోందా? అనే అంశాల మీద చర్చలు జరుగుతున్నాయి. నాగచైతన్య ఎలా అయితే తాను శోభితను నిశ్చితార్థం చేసుకున్నాను అని ప్రకటించాడో సమంత కూడా అలా ఏమైనా ప్రకటిస్తుందా అనే చర్చ జరుగుతోంది. మీ ఉద్దేశం ఏంటో తెలియజేయండి

Exit mobile version