Samantha: స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు, దర్శకుడు రాజ్ నిడిమోరు దంపతుల జీవితంలో సరికొత్త ఆనందం నిండింది. ఈ దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించినట్లు సమంత తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా తాజాగా వెల్లడించింది. నిన్న అంటే 19.11.2026 తేదీన పండంటి మగ బిడ్డ జన్మించినట్లు సమంత వెల్లడించింది. తమ ముద్దుల కుమారుడికి ‘దేవ్ నిడిమోరు’ (DEV NIDIMORU) అని నామకరణం చేసినట్లు ఆ పోస్ట్‌లో పేర్కొంది. “మా హృదయాలు ఎన్నడూ లేనంత సంతోషంగా ఉన్నాయి” అంటూ సమంత, రాజ్ తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చిన్నారికి ఆయురారోగ్యాలు, సంతోషం కలగాలని ఆకాంక్షిస్తూ కామెంట్లు చేస్తున్నారు. సమంత, రాజ్ తమ జీవితంలో ఈ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన వేళ అభిమానుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి.
Samantha: సమంత, రాజ్ దంపతులకు పండంటి మగబిడ్డ.. ముద్దుల కుమారుడి పేరు ఇదే..

Samantha Ruth Prabhu Raj Nidimoru
