టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పేరుకు పరిచయాలు అవసరం లేదు.. ఈ అమ్మడు ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకోవడమే కాదు.. అవార్డులను కూడా అందుకుంది. సమంత ఇటీవల సంచలన పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.. ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ప్రకటించి ఫ్యాన్స్ కి షాకిచ్చింది.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అదిరిపోయే ఫోటో షూట్ లను చేస్తూ ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది..
తాజాగా అదిరిపోయే ఫోటోలను షేర్ చేసింది.. అవి కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఫెమినా మ్యాగజైన్ కోసం సమంత ఈ ఫోటో షూట్ చేసింది.. తెలుగులో ఖుషి షూటింగ్‌లో పాల్గొంది. అదే సమయంలో సిటాడెల్ షూటింగ్‌లోనూ పాల్గొంది. ఖుషి షూటింగ్ పూర్తి చేసుకుంది.. కొత్తగా ఆమె దేనికి కమిట్ కాలేదని తెలుస్తుంది…ఇటీవల ఎక్కువగా ఆధ్యాతిక ప్రాంతాల్లో సందర్శిస్తూ యోగ, పూజలు చేస్తోంది. తన ఆరోగ్యం కుదుటపడడం కోసం సమంత చేయని ప్రయత్నం అంటూ లేదు. మెడికల్, యోగ, ఫిట్ నెస్ ట్రైనింగ్ ఇలా సమంత అన్ని రకాలుగా తిరిగి బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది..
ఇక సమంత సినిమాల్లో బిజీ అవ్వాలని చూస్తుంది.. కొత్త ప్రాజెక్ట్స్ మొదలు పెడుతున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా సమంత చేసిన ఫోటో షూట్ అభిమానులకు, నెటిజన్లకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చేలా ఉంది.. ఫెమినా మ్యాగజైన్ కోసం సమంత ఈ ఫోటో షూట్ చేసింది.. అయితే ఆ ఫోటోలు వైరల్ అవ్వడంతో నెటిజన్స్ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. దీని పై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
