Site icon NTV Telugu

అల్లు స్నేహరెడ్డి కోసం స్టైలిస్ట్‌ ప్రీతమ్‌…

సమంత స్టైలిస్ట్‌, డిజైనర్‌గా గత కొంత కాలంగా ప్రీతమ్‌ పేరు మారు మోగుతుంది. ప్రీతమ్‌ సమంత సోఫా మీద కూర్చోని అందులో సమంత కాళ్లను ఒళ్లో పెట్టుకుని ఉండటంతో ఒక్కసారిగా అతను లైమ్‌ లైట్‌లోకి వచ్చాడు. ఈ ఫోటో నెట్టింట్ల తెగ వైరల్‌ అయింది. సమంత మీద అక్కినేని అభిమానులయితే ఓ రేంజ్‌లో హర్ట్‌ అయ్యా రు. వెంటనే సమంత ఆ ఫోటోను డీలీట్‌ చేసింది. అయితే నాగ చైత న్య విడాకుల విషయంలోనూ ప్రీతమ్‌ జుకల్కర్‌ పేరు ఎక్కువగా విని పించింది. ప్రీతమ్‌ వల్లే వారి బంధానికి బీటలు వారిందని సోషల్‌ మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి. ఆతర్వాత ప్రీతమ్‌ సమంతను అక్క అని పిలుస్తానని ఆవిషయం చైతూకి కూడా తెలుసుంటూ ప్రీతమ్‌ ఎమోషనల్‌ అయ్యాడు.

ఇక సమంత స్టైలిస్ట్‌, డిజైనర్‌గా రకరకాల వైరైటీ దుస్తులను క్రియేట్‌ చేస్తాడు. ఈ దీపావళికి సైతం అదిరిపోయే కలెక్షన్లు రెడీ చేశాడు. తాజాగా అల్లు స్నేహరెడ్డికి కూడా ప్రీతమ్‌ స్టైలిష్ట్‌గా వ్యవరిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీపావళికి ప్రీతమ్‌ రెడీ చేసిన డ్రెస్‌లో అల్లుస్నేహరెడ్డి అదిరిపోయింది. ఇక తాజాగా స్నేహరెడ్డి ఆ ఫోటోలను షేర్‌ చేసింది. దీనిపై శ్రియా సైతం కామెంట్‌ చేసింది. దానికి శ్రియాకు స్నేహరెడ్డి థ్యాంకు అని రిప్లై ఇచ్చింది.

https://twitter.com/Soul_Indiian/status/1457250132731125762?s=20
Exit mobile version