NTV Telugu Site icon

Samantha : జిమ్ లో తెగ కష్టపడుతున్న సామ్..వీడియో వైరల్…

Samantha (5)

Samantha (5)

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పేరుకు పరిచయాలు అవసరం లేదు.. ఈ అమ్మడు ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకోవడమే కాదు.. అవార్డులను కూడా అందుకుంది. సమంత ఇటీవల సంచలన పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.. ఏడాది పాటు సినిమాలకు బ్రేక్‌ ప్రకటించి ఫ్యాన్స్ కి షాకిచ్చింది.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అదిరిపోయే ఫోటో షూట్ లను చేస్తూ ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది.. తాజాగా జిమ్ లో తెగ వర్కౌట్స్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో వదిలింది.. ఆ వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది..

తాజాగా సమంత సోషల్ మీడియాలో వర్క్ అవుట్ చేస్తున్న వీడియోను షేర్ చేశారు. బ్లాక్ టైట్ ఫిట్ లో సమంత ట్రైనర్ సహాయంతో వర్కౌట్స్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆరోగ్య సమస్యల కారణంగా బ్రేక్ తీసుకున్న సమంత జిమ్ లో ఎందుకు ఇంతలా కష్టపడుతున్నారు అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.. ఏది ఏమైన సమంత డెడికేషన్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు…

ఇకపోతే త్వరలోనే సీటాడెల్ వెబ్ సిరీస్ విడుదల కాబోతుంది. ప్రస్తుతం సమంత ఖాళీగా ఉన్నట్లు తెలుస్తుంది. జిమ్ లో వర్క్ అవుట్ చేస్తూ తన వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నారు. స్పై థ్రిల్లర్ర్ డ్రామా ది ఫ్యామిలీ మెన్ 2లో సమంత రాజీ పాత్రను పోషించారు. ఈ వెబ్ సిరీస్ ను రాజ్ అండ్ డీకే రూపొందించారు. ఇందులో మనోజ్ భాజ్ పేయి ప్రధాన పాత్రలో నటించారు.. ఇక వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తుంది.. ఆమె దూకుడు చూస్తుంటే త్వరలోనే బిజీ అవ్వబోతుందని తెలుస్తుంది..