టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ భామ గత ఏడాది సెప్టెంబర్‌లో ఖుషి మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది .దీని తర్వాత సమంత ఏ మూవీ చేయలేదు. దీంతో సమంత మళ్లీ ఎప్పుడు సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుందా అని ఆమె ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా సమంత ఆమె ఫ్యాన్స్ కు గుడ్‍న్యూస్ చెప్పారు. ఏప్రిల్ 28 సమంత పుట్టిన రోజు సందర్భంగా తన తర్వాతి సినిమాను వెల్లడించారు. ‘మా ఇంటి బంగారం’ అనే టైటిల్ ను సమంత అనౌన్స్ చేశారు. ఈ మూవీలో తాను బంగారం పాత్ర చేస్తున్నట్టుగా ఆమె పేర్కొన్నారు. ‘మా ఇంటి బంగారం’ సినిమా పోస్టర్ ఎంతో ఇంట్రెస్టింగ్‍గా ఉంది. ఈ సినిమాలో సమంత కొత్తగా పెళ్లయిన అమ్మాయిగా నటిస్తున్నారని తెలుస్తుంది.
వంట గదిలో సమంత తుపాకీ పట్టుకున్నట్టు ఈ పోస్టర్ ఉంది. ఒంటిపై రక్తపు మరకలు కూడా ఉన్నాయి. ఈ లుక్ ఎంతో ఇంటెన్స్‌గా ఉంది. మరో సరికొత్త కథాంశంతో సమంత ప్రేక్షకుల ముందుకు రానుంది .మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ మూవీని సమంతనే నిర్మిస్తున్నారు. తన ప్రొడక్షన్ హౌస్ త్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని సమంత ప్రొడ్యూస్ చేయనున్నారు. గతేడాది డిసెంబర్ లో సమంత ఈ బ్యానర్‌ను స్థాపించారు. ఇప్పుడు ఆ బ్యానర్ పైనే తన కొత్త మూవీని నిర్మిస్తున్నారు.అయితే, మా ఇంటి బంగారం మూవీ కి సంబంధించి ఇతర వివరాలను సమంత ఇప్పుడు వెల్లడించలేదు.ఈ చిత్రానికి దర్శకుడు ఎవరనేది కూడా ఆమె ప్రకటించలేదు. త్వరలోనే ఈ మూవీ ప్రారంభం కానుందని సమాచారం .