NTV Telugu Site icon

Citadel Honey Bunny : ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సమంత అవైటెడ్ సిరీస్..

Citadel

Citadel

Citadel Honey Bunny : వరుణ్ ధావన్, సమంత రూత్ ప్రభు జంటగా నటించిన యాక్షన్ ప్యాక్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’. సమంత చాలాకాలం గ్యాప్ తర్వాత మళ్లీ ఆడియెన్స్ ను పలకరించేందుకు వచ్చేసింది. సినిమాలు సహా ఓటీటీ లో కూడా ఎంట్రీ ఇచ్చిన సమంత అక్కడ కూడా సాలిడ్ డెబ్యూ అందుకుంది. ఇక తన మొదటి వెబ్ సిరీస్ తర్వాత చేసిన రెండో వెబ్ సిరీస్ “సిటాడెల్ హనీ బన్నీ”. ఈ సిరీస్ నేటి నుంచి స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ సిరీస్ ని అమేజాన్ ప్రైమ్ వీడియో.. పాన్ ఇండియా భాషలు సహా మొత్తం 20 భాషల్లో మొత్తం ఆరు ఎపిసోడ్స్ గా తీసుకొచ్చారు. మరి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో తెలియాలి అంటే ప్రైమ్ వీడియోలో చూడాల్సిందే.

Read Also:Telangana Temperature: తెలంగాణను వణికిస్తున్న చలి.. పడిపోతున్న ఉష్ణోగ్రతలు..

ఈ సిరీస్ ట్రైలర్ కోసం అభిమానులు కొంత కాలంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వరుణ్ ధావన్, సమంత రూత్ ప్రభు ఇద్దరూ డిటెక్టివ్‌ల పాత్రలో కనిపించబోతున్నారు. దాదాపు రెండు నిమిషాల 51 సెకన్ల నిడివి గల ‘సిటాడెల్: హనీ బన్నీ’ ట్రైలర్ ను ఇటీవల రిలీజ్ చేశారు. చాలా ఆసక్తికరంగా, యాక్షన్‌తో నిండి ఉంది. అయితే, ఈ ట్రైలర్‌లో వాళ్ళ డైలాగ్స్ కంటే ఎక్కువగా తుపాకీ కాల్పుల శబ్దాలు వినవచ్చు. ఈ కథలో స్టంట్‌మ్యాన్ బన్నీగా వరుణ్ ధావన్, ఏజెంట్ హనీగా సమంత నటించారు. ఈ యాక్షన్ స్పై థ్రిల్లర్ సిరీస్ ని సామ్ కి డెబ్యూ ఇచ్చిన దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే లు తెరకెక్కించారు.

Read Also:Social Media Ban: ఈ వయస్సులోపు పిల్లలకు ఇన్స్టాగ్రామ్​, ఫేస్బుక్ నిషేదం

వారి ప్రమాదకరమైన గతాలు వెలుగులోకి వచ్చినప్పుడు విడిపోయిన హనీ, బన్నీ కొన్నేళ్ల తర్వాత తమ కుమార్తె నదియా భద్రత కోసం పోరాడేందుకు మళ్లీ ఒక్కటవుతారు. ఈ సిరీస్‌లో కె.కె. మీనన్ సహా సిమ్రాన్, సాకిబ్ సలీమ్, సికందర్ ఖేర్, సోహమ్ మజుందార్, శివన్‌కీత్ పరిహార్, కష్వీ మజ్ముదార్‌ వంటి వారు నటిస్తున్నారు. ఈ రోజు ప్రైమ్ వీడియోలో భారతదేశంలో.. 240 కంటే ఎక్కువ దేశాలలో విడుదల కానుంది. ఈ సిరీస్ ను D2R ఫిల్మ్స్, అమెజాన్ MGM స్టూడియోస్, AGBO రస్సో బ్రదర్స్ నిర్మించారు.