NTV Telugu Site icon

Samajavaragamana : రెట్టింపు లాభాలతో దూసుకుపోతున్న సామజవరగమన..

Whatsapp Image 2023 07 04 At 10.49.02 Am

Whatsapp Image 2023 07 04 At 10.49.02 Am

భారీ బడ్జెట్ తో విడుదల అవుతున్న పెద్ద సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా దెబ్బతింటున్నాయి.సినిమా తీసిన నిర్మాతల కు భారీ నష్టాలను మిగిలిస్తున్నాయి.కానీ కంటెంట్ వున్న చిన్న చిత్రాలు మాత్రం కాసుల వర్షం కురిపిస్తున్నాయి., రీసెంట్ గా విడుదలైన చిన్న సినిమా ‘సామజవరగమనా’.. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను నమోదు చేసుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. మొదటి రెండు రోజులు అంతగా ఓపెనింగ్స్ లేక ఇబ్బంది పడిన ఈ సినిమా మూడవ రోజు నుండి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ రాబడుతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ రైట్స్ మూడు కోట్ల 20 లక్షల రూపాయల కు అమ్ముడుపోయిందని సమాచారం.

నాలుగు రోజులకు కలిపి ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తం గా అన్నీ ప్రాంతాలను కలిపి దాదాపు 5 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టినట్లు సమాచారం.. ఇక ఐదవ రోజు కూడా ఈ చిత్రానికి మొదటి రోజు కంటే ఎక్కువగానే వసూళ్లు వచ్చాయి. ట్రేడ్ పండితుల లెక్క ప్రకారం ఈ సినిమా 5 వ రోజు 50 లక్షల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు సాధించింది.. అలా పెట్టిన డబ్బులకు రెట్టింపు లాభాలను కేవలం 5 రోజుల్లోనే సాధించింది.. ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ ని కొనుగోలు చేసిన బయ్యర్స్ భారీ లాభాలను పొందుతున్నారు. కేవలం అమెరికాలోనే ఈ చిత్రం రైట్స్ 25 లక్షల రూపాయలకు అమ్ముడయింది.. ఇప్పటి వరకు ఈ చిత్రానికి రెండు కోట్ల రూపాయిల వరకు షేర్ వచ్చినట్లు సమాచారం. అంటే దాదాపు 75 లక్షల రూపాయిలు లాభాల్ని అందుకుంది. ఈ సినిమాని AK ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై అనిల్ సుంకర నిర్మించాడు. ఈయన గతంలో నిర్మించిన ‘ఏజెంట్ ‘ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అయ్యింది. దాదాపు నిర్మాత కు 40 కోట్ల రూపాయలకు పైగా నష్టం వచ్చింది.. కానీ సామజవరాగమన సినిమా ఆయనకు కాస్త ఊరటను ఇచ్చింది.