Site icon NTV Telugu

Samajavaragamana : ఓటీటీ విడుదల ఎప్పుడో తెలుసా..?

Whatsapp Image 2023 07 11 At 3.42.40 Pm

Whatsapp Image 2023 07 11 At 3.42.40 Pm

టాలీవుడ్ లో ఈ మధ్య ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల చిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం సాధిస్తున్నాయి.. ‘ప్రభాస్’ హీరో గా నటించిన ఆదిపురుష్ సినిమా వల్ల బయ్యర్స్ ఎంతగానో నష్టపోయారు..ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమాకు పెద్ద దెబ్బే తగిలింది. ప్రభాస్ కెరీర్ లో మరో భారీ ప్లాప్ సినిమా గా నిలిచింది అదిపురుష్.అలాంటి సమయం లో ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలైన ‘సామజవరగమన సినిమా భారీ విజయం సాధించింది.ఈ సినిమాకు కేవలం మూడు కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రమే జరిగింది.ఈ చిత్రం పది రోజులకు గాను సుమారు 11 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూలు చేసింది.. అంటే బయ్యర్స్ కి భారీగా లాభాలు తెచ్చిపెట్టింది ఈ సినిమా.ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా పెద్ద విజయం సాధించింది., అక్కడ ఈ చిత్రానికి 8 లక్షల డాలర్లు పైగా కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమా ఫుల్ రన్ లో ఈ చిత్రం కేవలం అమెరికా నుండే 1 మిలియన్ డాలర్లు రాబట్టే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. ఈ మధ్య చిన్న సినిమాలను థియేటర్స్ లో చూడటం కంటే ఓటీటీ లో చూసేందుకే ఎక్కువగా ఇష్టపడుతున్నారు.అందుకోసం సామజవరాగమన ఓటీటీ లో విడుదల చేయబోతున్నారు.

ఈ సినిమాని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది. ఈసినిమాను ఈ నెల 22 వ తేదీన లేదా 25 వ తేదీన కానీ ఓటీటీ లో విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.థియేటర్స్ లో భారీ రెస్పాన్స్ ని దక్కించుకుంటున్న ఈ సినిమా ఓటీటీ ఆడియన్స్ ని కూడా అదే స్థాయిలో మెప్పిస్తుందో లేదో చూడాలి. ఇక ఈ సినిమాని ప్రముఖ నిర్మాత అయిన అనిల్ సుంకర నిర్మించిన విషయం అందరికీ తెలిసిందే. ఆయన రీసెంట్ గా నిర్మించిన ‘ఏజెంట్’ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఆ సినిమా కారణంగా సుమారుగా 50 కోట్ల రూపాయిల నష్టం వచ్చినట్లు సమాచారం. సామజవరాగమన సినిమాతో ఆయనకు వచ్చిన నష్టం కొద్దిగా అయినా తీరిందని చెప్పవచ్చు.

Exit mobile version