NTV Telugu Site icon

Sam Bahadur :సామ్ బహదూర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కండంటే..?

Whatsapp Image 2023 12 08 At 1.31.06 Pm

Whatsapp Image 2023 12 08 At 1.31.06 Pm

బాలీవుడ్‌ స్టార్ హీరో విక్కీ కౌశల్ నటించిన లేటెస్ట్ మూవీ సామ్ బహదూర్. ఈ సినిమా డిసెంబర్ 1న థియేటర్ల లో రిలీజైంది.సామ్ బహదూర్ మూవీ యానిమల్ తో పోటీ పడుతూ కూడా మంచి వసూళ్లే సాధించింది.ఇక ఇప్పుడీ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు రానుంది.సామ్ బహదూర్ మూవీ రిపబ్లిక్ డే సందర్భం గా జనవరి 26 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.విక్కీ కౌశల్ నటించిన ఈ వార్ డ్రామా సామ్ బహదూర్ కు ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇప్పటికే ఉరి మరియు సర్దార్ ఉధమ్ లాంటి దేశభక్తి సినిమాలు చేసిన విక్కీ.. ఇప్పుడు సామ్ బహదూర్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. గొప్ప దేశభక్తుడు సామ్ మానిక్‌షా పాత్ర లో విక్కీ కనిపించాడు.

సామ్ బహదూర్ సినిమాను మేఘన గుల్జార్ డైరెక్ట్ చేసింది. అయితే ఈ సినిమా థియేటర్లలో రిలీజై న మూడు నుంచి నాలుగు వారాల్లోనే ఓటీటీ లోకి వస్తుందన్న వార్తలు మొదట్లో వచ్చాయి. కానీ మేకర్స్ మాత్రం జనవరి 26 న రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమాలో గొప్ప దేశభక్తుడు మానిక్‌ షా పాత్ర లో విక్కీ కౌశల్ నటన కు ప్రశంసలు లభించాయి.అయితే ఈ సినిమాకు భారీ గా ప్రశంసలు దక్కినా కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం అంతగా ఆకట్టుకోలేదు.ఇండియాలో తొలి ఫీల్డ్ మార్షల్, లెజెండరీ ఆర్మీ జనరల్ సామ్ హెచ్ఎఫ్ మాణిక్ షా జీవితం ఆధారంగా సామ్ బహద్దూర్ తెరకెక్కింది. ఈ చిత్రంలో మాణిక్ షా భార్యగా సాన్య మల్హోత్రా, ఇందిరా గాంధీ పాత్రలో ఫాతిమా సనా షేక్, జవహర్ లాల్ నెహ్రూగా నీరజ్ కాబీ మరియు లార్డ్ మౌంట్ బ్యాటెన్‌టా ఎడ్వార్డ్ సానెన్ బ్లిక్ అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్‌ గా గోవింద్ నామ్‌దేవ్ నటించారు.