Site icon NTV Telugu

Salumarada Thimmakka: 114 ఏళ్ల “వృక్షమాత” సాలుమరద తిమ్మక్క కన్నుమూత..

Ka

Ka

Salumarada Thimmakka: కర్ణాటకకు చెందిన వృక్షమాత, పద్మశ్రీ పురస్కార గ్రహీత 114 ఏళ్ల సాలుమరద తిమ్మక్క అనారోగ్య కారణాలతో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఈ సమాచారాన్ని కుటుంబీకులు సమాచారం అందించారు. తిమ్మక్క మృతిపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తీవ్ర విచారం వ్యక్తంచేశారు.

READ MORE: Card Cloning: కార్డ్ క్లోనింగ్ అంటే ఏంటీ.. అది ఎలా జరుగుతుందో తెలుసా…

1911 జూన్ 30న తుముకూరు జిల్లాలోని గుబ్బి తాలూకాలో జన్మించిన తిమ్మక్క శ్రీ బిక్కల చిక్కయ్యను వివాహమాడారు. ఈ దంపతులకు పిల్లలు లేకపోవడంతో అంతా హేళన చేసిన పట్టించుకోలేదు.. ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు.. ఇద్దరు కలిసి.. మొక్కలు నాటడం మొదలుపెట్టారు. జన్మించిన తిమ్మక్క వృక్ష సంరక్షణకు తన జీవితాన్ని అంకితం చేశారు. వాటికి ఆయువు పోశారు. మొక్కలనే సొంత బిడ్డలుగా భావించి ప్రేమను పంచి.. వేలాది వృక్షాలతో వనాన్నే ఏర్పాటు చేశారు. మర్రి చెట్ల పెంపకాన్ని మొదలుపెట్టిన తర్వాత నీళ్లు పోయ్యడం కోసం నాలుగు కిలోమీటర్ల వరకు ఎంతో కష్టపడి నీళ్లను మోసుకెళ్లేవారు. ఆమె చేసిన నిస్వార్థ సేవలకుగాను భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఇందిరా ప్రియదర్శిని, నాడోజా, వృక్ష మాత తదితర అవార్డులను గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు. సాధారణంగా మొక్కల పెంపకంపై దృష్టి పెట్టే వాళ్లను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అయితే, ఈ వృద్ధురాలు మాత్రం ఏకంగా వేలాది మొక్కలను నాటి తన మంచి మనస్సును చాటుకున్నారు. పెళ్లై 20 ఏళ్లైనా పిల్లలు పుట్టకపోవడంతో మొక్కలను నాటి ఆ మొక్కలనే పిల్లల్లా పెంచుకుంటూ.. అందరికీ ఆదర్శంగా మారారు. 65 ఏళ్ల కాలంలో భర్త సహాయంతో వేలాది మర్రి చెట్లను, పలు రకాల వృక్షాలను నాటి.. ‘‘మదర్ ఆఫ్ ట్రీస్’’ గా ప్రసిద్ధి చెందారు.

Exit mobile version