NTV Telugu Site icon

Tiger 3 : సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’

Whatsapp Image 2024 01 07 At 5.04.32 Pm

Whatsapp Image 2024 01 07 At 5.04.32 Pm

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘టైగర్ 3’ సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది.సల్మాన్ ఖాన్ గత కొంతకాలంగా వరుస అపజయాలతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ మధ్యకాలంలో ఆయన నటించిన రాధే, అంతిమ్, కిసీ కా బాయ్ మరియు కిసీ కా జాన్.. వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద వరుసగా బోల్తా పడ్డాయి. గత ఏడాది సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేసిన ‘పఠాన్’ మాత్రం భారీ సక్సెస్ అందుకుంది.వరుస ప్లాప్స్ తర్వాత ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని ‘టైగర్ 3’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సల్మాన్ ఖాన్. టైగర్ మూవీ సిరీస్ లో భాగంగా వచ్చిన మూడో సినిమా ఇది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మనీష్ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సల్మాన్ సరసన కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించింది.

గతంలో వీరిద్దరూ కలిసి ఏక్తా టైగర్ మరియు టైగర్ జిందా హై వంటి బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించిన విషయం తెలిసిందే. ఇక ‘టైగర్ 3’ తో ముచ్చటగా మూడోసారి జతకట్టి ప్రేక్షకుల ముందుకు వచ్చారు.భారీ అంచనాల నడుమ దీపావళి కానుకగా నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. సినిమాకి ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది. టైగర్ యూనివర్స్ లో వచ్చిన గత చిత్రాల రేంజ్ లో ‘టైగర్ 3’ లేకపోవడంతో భారీ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఇదిలా ఉంటే ‘టైగర్ 3’ ఓటీటీ రిలీజ్ పై అమెజాన్ ప్రైమ్ వీడియో త్వరలో ఓటీటీ స్ట్రీమింగ్ కు రాబోతుంది అంటూ ట్వీట్ చేసింది. తీరా ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండా జనవరి 7 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో ‘టైగర్ 3 ‘ స్ట్రీమింగ్ అవుతోంది. ముఖ్యంగా సల్మాన్ ఫ్యాన్స్​కి, టైగర్ 3 మేకర్స్ మరో సర్​ఫ్రైజ్ ఇచ్చారు. ‘టైగర్ 3’ కి సంబంధించి సెన్సార్ బోర్డు కట్ చేసిన  సన్నివేశాలతో కలిపి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ సినిమాని స్ట్రీమింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా థియేటర్లో కట్ చేసిన కత్రినా కైఫ్ టవల్ ఫైట్ సీన్​తో పాటు మరికొన్ని హాట్ సీన్స్ కూడా ఓటిటి వెర్షన్ లో అందుబాటులో ఉన్నట్లు తెలుస్తుంది..

Show comments