Mythri Movie Makers: బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్ తన కెరీర్‌లో ఎప్పుడూ చేయని ఒక విభిన్నమైన పాత్రకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. సెన్సేషనల్ డైరెక్టర్స్ ద్వయం రాజ్ & డీకే దర్శకత్వంలో, టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఒక భారీ ‘సూపర్‌హీరో కామెడీ’ చిత్రం పట్టాలెక్కబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో సల్మాన్ హీరోగా నటించబోతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా హాలీవుడ్ సూపర్ హిట్ ‘హ్యాంకాక్’ (విల్ స్మిత్ నటించినది) స్పూర్తితో తెరకెక్కనుందని టాక్. సూపర్ పవర్స్ ఉండి, లోకాన్ని రక్షించి అలసిపోయిన ఒక హీరో.. ఆ బాధ్యతల నుంచి విరామం తీసుకోవాలని అనుకుంటాడు. కానీ పరిస్థితులు అతడిని మళ్లీ ఎలా యాక్షన్‌లోకి లాగాయి అనేదే ఈ చిత్ర కథ. రాజ్ & డీకే మార్క్ షార్ప్ హ్యూమర్, హై-వోల్టేజ్ యాక్షన్, కామెడీ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో ఈ హై-కాన్సెప్ట్ మూవీ రూపొందనుందని సినీ సర్కిల్‌లో ప్రచారం జరుగుతుంది.
READ ALSO: PM Modi: తృణమూల్ అహంకారం ముక్కలవుతుంది.. మమతా సర్కార్‌పై ప్రధాని ఫైర్..
‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘ఫర్జీ’ వంటి సిరీస్‌లతో గ్లోబల్ గుర్తింపు పొందిన రాజ్ & డీకే, ఈ సినిమా ద్వారా సల్మాన్ ఖాన్‌ను ఒక సరికొత్త మేకోవర్‌లో చూపించబోతున్నట్లు సమాచారం. ‘పుష్ప’ వంటి పాన్-ఇండియా హిట్స్ ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్, అతుల్ అగ్నిహోత్రి (రీల్ లైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్)తో కలిసి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. సల్మాన్ ఖాన్ గత కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాయి. ఈ క్రమంలో రాజ్ & డీకే వంటి వెర్సటైల్ డైరెక్టర్స్, మైత్రి వంటి సక్సెస్‌ఫుల్ ప్రొడక్షన్ హౌస్ తోడవ్వడంపై ఈ సినిమాపై సల్మాన్ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు మైత్రి మూవీ మేకర్స్, రాజ్ & డీకే, సల్మాన్ ఖాన్ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అధికారిక ప్రకటన వెలువడక ముందే ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ‘టాక్ ఆఫ్ ది టౌన్’గా మారింది.
READ ALSO: Sivaji: ఆ హీరోకు నాన్న క్యారెక్టర్ అంటే నేను చచ్చినా చేసేవాణ్ణి కాదు: శివాజీ
