MS Dhoni: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, మాజీ టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, కెనడియన్-ఇండియన్ గాయకుడు ఏపీ ధిల్లన్ కలిసి అడ్వెంచర్ మూడ్‌లో కనిపించారు. సల్మాన్ ఖాన్ పణవేల్ ఫామ్‌హౌస్‌లో వీరు ఏటీవీ వాహనంతో ఆఫ్‌రోడింగ్ చేస్తూ సరదాగా గడిపిన క్షణాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ట్రిప్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఏపీ ధిల్లన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అంతేకాదు.. సల్మాన్ ఖాన్ బావ అతుల్ అగ్నిహోత్రి కొన్ని చిత్రాలు పంచుకున్నారు. గుట్టలు, మట్టిరోడ్లు, విస్తృతమైన ఓపెన్ గ్రౌండ్‌లో ఏటీవీ నడుపుతూ ముగ్గురూ ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఒకవైపు సినిమా హీరో, మరోవైపు క్రికెట్ లెజెండ్, ఇంకోవైపు దేశంలోనే అత్యధికంగా స్ట్రీమ్ అయ్యే గాయకుడు.. ఇలా ముగ్గురు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం ప్రత్యేకంగా మారింది.
READ MORE: Honey Trap: శృంగార వల.. 100 మంది బలి.! కరీంనగర్ దంపతుల గలీజ్ దందా.!
అదే పోస్ట్‌లో ఏపీ ధిల్లన్ ఓపెన్ గ్రౌండ్‌లో ఏటీవీతో డ్రిఫ్టింగ్ చేస్తూ, తడి మట్టి మీద డోనట్స్ వేస్తూ కనిపించాడు. ఈ ఫొటోలు వర్షాకాలంలో తీసినవై ఉండొచ్చని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఒక దశలో ఏటీవీ మట్టిలో ఇరుక్కుపోయినట్లు కూడా కనిపించింది. దీనిపై ధిల్లన్ “ఇది ఎవరు క్రాష్ చేశారో చెప్పండి?” అంటూ సరదాగా క్యాప్షన్ పెట్టాడు. దీంతో కామెంట్ సెక్షన్ మొత్తం సల్మాన్, ధోనీ, ధిల్లన్ అభిమానుల స్పందనలతో నిండిపోయింది. ఈ వీడియోల్లో కనిపిస్తున్న ఏటీవీ పోలారిస్ ఆర్‌జెడ్‌ఆర్ మోడల్‌గా తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఇది పలు వేరియంట్లలో లభిస్తుంది. టాప్ వేరియంట్‌లో 2.0 లీటర్, నాలుగు సిలిండర్ల ఇంజిన్ ఉండి 225 హెచ్‌పీ శక్తిని ఇస్తుంది. ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో 4డబ్ల్యూడీ సిస్టమ్ కలిగిన ఈ వాహనంలో రాక్, స్పోర్ట్, రేస్ వంటి డ్రైవ్ మోడ్‌లు ఉన్నాయి. భారీ చక్రాలు, బలమైన డిజైన్‌తో ఇది ఎక్స్‌ట్రీమ్ ఆఫ్‌రోడింగ్ కోసం ప్రత్యేకంగా తయారు చేశారు. ఈ ఏజ్‌లోనూ ఉత్సాహం తగ్గలేదని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
READ MORE: Yellamma : రాక్ స్టార్ DSP ‘ఎల్లమ్మ’ జాతర.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న రా అండ్ రస్టిక్ గ్లింప్స్!
