Salim Khan: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తండ్రి, ప్రముఖ రైటర్ సలీం ఖాన్ ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేరారు. ఈ వార్త తెలియగానే అభిమానులు ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారు, ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. నిజానికి ఈ వార్త బయటికి రాగానే సలీం ఖాన్‌కు ఏమైందో తెలుసుకోవడానికి అందరూ ప్రయత్నించడం ప్రారంభించారు. అయితే, ఆయన ఆరోగ్యం గురించి ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం విడుదల కాలేదు. సల్మాన్ ఖాన్ కుటుంబం ఇంకా సలీం ఖాన్ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
READ ALSO: Mani Shankar Aiyar: నువ్వు చాలు సామి, కాంగ్రెస్‌ను ముంచనీకి..
తండ్రిని కలవడానికి వచ్చిన సల్మాన్ ఖాన్..
సలీం ఖాన్ ఆసుపత్రిలో చేరినట్లు తెలియగానే ఖాన్ కుటుంబం మొత్తం ఆందోళన చెందుతోంది. తన తండ్రి ఆరోగ్యం గురించి తెలిసిన వెంటనే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ లీలావతి ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయన ఆసుపత్రికి వెళ్లిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో ఆయన ఫేస్‌లో బాధ, ఆందోళన స్పష్టంగా కనిపించాయి. అలాగే అల్విరా ఖాన్ కూడా తన తండ్రిని కలవడానికి ఆస్పత్రికి వెళ్లారు. అర్పిత, ఆమె భర్త ఆయుష్ శర్మ కూడా ఆసుపత్రికి చేరుకున్న ఫోటోలు కనిపించాయి. అయితే, సలీం ఖాన్ సాధారణ చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లారా లేదా ఏదైనా తీవ్రమైన సమస్య ఉందా అనే విషయాన్ని ఇప్పటి వరకు ఖాన్ కుటుంబం వెల్లడించలేదు.
సలీం ఖాన్ గురించి చెప్పాలంటే.. ఆయన బాలీవుడ్ పరిశ్రమలో దిగ్గజ రైటర్స్‌లో ఒకరు. ఆయన తన సినీ కెరీర్‌ను ఫస్ట్ నటుడిగా ప్రారంభించినా, తర్వాత తర్వాత గొప్ప రైటర్‌గా ఎదిగారు. ఆయన, జావేద్ అక్తర్‌తో కలిసి జంజీర్, షోలే, డాన్, షాన్, యాదోం కి బారాత్ వంటి అనేక ఐకానిక్ బాలీవుడ్ చిత్రాల కథలను రాశారు. సలీం ఖాన్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. ఆయన వయసు 90 సంవత్సరాలు. ఆయన ఇండోర్‌లో 1935 నవంబర్‌లో జన్మించారు. 1964లో, సలీం ఖాన్ సుశీలా చరక్‌ను (సల్మా ఖాన్) వివాహం చేసుకున్నారు. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. ముగ్గురు కుమారులు (సల్మాన్ ఖాన్, అర్బాజ్ ఖాన్, సోహైల్ ఖాన్, ఒక కుమార్తె అల్విరా ఖాన్). అలాగే సలీం ఖాన్ అర్పిత అనే కుమార్తెను దత్తత తీసుకున్నారు. అలాగే ఆయన నటి హెలెన్‌ను కూడా వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన తన కుటుంబంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఈక్రమంలో ఆయన ఆస్పత్రిలో చేరినట్లు వార్తలు రావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
READ ALSO: Pathum Nissanka Record: పాతుమ్ నిశాంక అరుదైన రికార్డు.. రెండో లంక బ్యాటర్‌గా..!
