పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ సలార్. కేజీఎఫ్ సినిమా లతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఈ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో సలార్ సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది..డిసెంబర్ 22న క్రిస్మస్ హాలిడేస్ సందర్భంగా మూవీ విడుదల కాబోతోంది. అయితే తాజాగా సలార్ ఓటీటీ హక్కులు భారీ మొత్తం పలికినట్లు మరోసారి వార్తలు తెరపైకి వస్తున్నాయి.గతంలో ఒకసారి సలార్ ఓటీటీ హక్కులు కళ్లు చెదిరే మొత్తానికి అమ్ముడైనట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ మొత్తం రూ.160 కోట్లు పలికినట్లు తేలడం విశేషం.. ప్రముఖ ఓటీటీ అయిన నెట్‌ఫ్లిక్స్ఈ సలార్ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం.సలార్ సినిమా ను తెరకెక్కించిన హోంబలె ఫిల్మ్స్ తో కొద్ది రోజుల కిందటే నెట్‌ఫ్లిక్స్ ఈ డీల్ కుదుర్చుకున్నట్లు తెలిసింది. .
హ్యాట్రిక్ ఫ్లాపుల తర్వాత కూడా ప్రభాస్ కు ఉన్న క్రేజ్ కు కూడా ఇది నిదర్శనం అని చెప్పాలి… బాహుబలి 2 తర్వాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ ప్లాప్ గా నిలిచాయి. అయినా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న సలార్ పై మాత్రం భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నిజానికి సెప్టెంబర్ 28 నే విడుదల కావాల్సింది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా డిసెంబర్ 22న రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు.సలార్ కంటే ఒక రోజు ముందుగా షారుక్ ఖాన్ నటించిన డంకీ మూవీ వస్తోంది. ఇప్పటికే ఈ ఏడాది పఠాన్, జవాన్ లతో కెరీర్లో ఆల్ టైమ్ హిట్స్ సొంతం చేసుకొని ఊపు మీదున్న షారుక్ ఖాన్ తో ప్రభాస్ పోటీ పడటంపై ఆసక్తి నెలకొంది.భారీ కలెక్షన్లు ఖాయం అనుకుంటున్న సమయంలో డంకీ నుంచి పోటీ సలార్ వసూళ్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని ట్రేడ్ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సలార్ రిలీజ్ ను వచ్చే ఏడాదికి వాయిదా వేయాలని కూడా మేకర్స్ భావిస్తున్నట్లు రూమర్స్ వస్తున్నాయి . అయితే ఈ సినిమా వాయిదా విషయం పై మేకర్స్ స్పందించలేదు..
