NTV Telugu Site icon

Salaar : సలార్ ఎఫెక్ట్.. బుక్ మై షో క్రాష్..

Whatsapp Image 2023 12 19 At 11.34.19 Pm

Whatsapp Image 2023 12 19 At 11.34.19 Pm

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సలార్.. కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 22 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది.సలార్’ టికెట్స్ కోసం రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘సలార్’ అడ్వాన్స్ బుకింగ్స్ మంగళవారం రాత్రి ఓపెన్ చేశారు. ఆ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్, సినిమాను నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేశాయి. దాంతో మంగళవారం రాత్రి 8.24 గంటలకు ఫ్యాన్స్ అందరూ బుక్ మై షో యాప్ ఓపెన్ చేశారు.

తెలంగాణ, ఏపీ థియేటర్లలో టికెట్స్ ఓపెన్ చేయడమే ఆలస్యం ప్రేక్షకులు ఒక్కసారిగా బుక్ మై షో యాప్ ను ఓపెన్ చేయడానికి ప్రయత్నించారు.ఒక్కసారిగా వేలాది, లక్షలాది మంది యాప్ ఓపెన్ చేయడంతో యాప్ కాసేపు పని చేయలేదు. క్రాష్ అయ్యింది.ఇంకేముంది..బుక్ మై షో క్రాష్ అయిన ఫోటోలు స్క్రీన్ షాట్స్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడం స్టార్ట్ చేశారు నెటిజన్స్. వారిలో ‘బాహుబలి’ చిత్ర నిర్మాతలలో ఒకరైన శోభు యార్లగడ్డ కూడ ఉన్నారు.యాప్ క్రాష్ కావడంతో కాసేపు బ్రేక్ ఇచ్చిన బుక్ మై షో, ఆ తర్వాత అన్ని థియేటర్ల టికెట్స్ ఒకేసారి అప్ లోడ్ చేయకుండా నెమ్మది గా ఒక్కో థియేటర్ బుకింగ్స్ ఓపెన్ చేయడం మొదలు పెట్టింది. ఇలాగే నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేసిన ‘అన్స్టాపబుల్’ టాక్ షోకి ప్రభాస్ అతిథి గా వచ్చారు. ఆ ఎపిసోడ్ స్ట్రీమింగ్ రోజున కూడా కాసేపు యాప్ పని చేయలేదు. ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువ మంది ఓపెన్ చేయడం తో ఆహా యాప్ క్రాష్ అయ్యింది. ఇప్పుడు ‘బుక్ మై షో’ వంతు అయింది.