Site icon NTV Telugu

AP Liquor Scam: మద్యం కేసులో రెండో రోజు సిట్‌ కస్టడీకి శ్రీధర్‌ రెడ్డి!

Sajjala Sridhar Reddy

Sajjala Sridhar Reddy

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) రెండవ రోజు కస్టడీకి తీసుకుంది. శ్రీధర్ రెడ్డిని ఉదయం విజయవాడ జిల్లా జైలు నుంచి గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించి.. వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సిట్ కార్యాలయానికి ఆయన్ను అధికారులు తరలించారు. సిట్ కార్యాలయంలో విచారణ ప్రారంభమైంది. నిన్న ఏడు గంటల పాటు శ్రీధర్‌ రెడ్డిని సిట్‌ అధికారులు విచారించారు. కీలక ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు.

Also Read: Gold Rate Today: షాకిచ్చిన బంగారం ధరలు.. గోల్డ్ రేట్స్ తగ్గాయన్న సంతోషం రెండు రోజులే!

లిక్కర్ కేసులో ఇప్పటికే ముగ్గురిని సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. మద్యం స్కాం లో‌ కీలకంగా పని‌చేసిన శ్రీధర్ రెడ్టి ద్వారా మరింత సమాచారం రాబట్టాలని భావించిన సిట్ అధికారులు.. ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసి కస్టడీ అనుమతి పొందారు. కేసులో కీలక నిందితుడిగా ఉన్న శ్రీధర్ రెడ్డిని న్యాయస్థానం మూడు రోజులు పోలీస్ కస్టడీకి ఇచ్చింది. మే 15, 16, 17 తేదీల్లో సిట్ అధికారులు సజ్జలను కస్టడీలోకి తీసుకోనున్నారు. మరోవైపు ధనుంజయ్‌ రెడ్డి, కృష్ణ మోహన్‌ రెడ్డిలు కూడా సిట్‌ విచారణకు హాజరయ్యారు.

 

 

Exit mobile version