Site icon NTV Telugu

Sajjala Ramakrishna Reddy: ప్రభుత్వం దృష్టికి ఇవి రాలేదా..? ఇవి వైఫల్యాలు కావా..?

Sajjala

Sajjala

Sajjala Ramakrishna Reddy: కూటమి ప్రభుత్వంపై మరోసారి ఫైర్‌ అయ్యారు వైసీపీ స్టేట్ కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి.. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన పార్టీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర కమిటీ, అన్ని జిల్లాల అధ్యక్షుల ఆత్మీయ సమావేశం జరిగింది.. ఈ సమావేశంలో సజ్జల మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌ పాలన ఈ ఐదేళ్లు కొనసాగి ఉంటే ఒక కొత్త జనరేషన్‌ తయారయ్యేదన్నారు.. ఒక మంచి వ్యవస్ధలను జగన్‌ రూపొందిస్తే చంద్రబాబు దానిని కుప్పకూల్చారని ఆరోపించారు.. జగన్‌ పాలనలో నాడు నేడు పేరుతో స్కూల్స్‌ అభివృద్ది జరిగితే.. ఇప్పుడు ఏం జరుగుతుంది..? అని నిలదీశారు.. కురుపాం, తురకపాలెం ఘటనలే ఇందుకు నిదర్శనం.. ఇది క్రిమినల్‌ నెగ్లిజెన్స్‌ కాదా..? ప్రభుత్వం దృష్టికి ఇవి రాలేదా..? ఇవి వైఫల్యాలు కావా..? అని నిలదీశారు సజ్జల..

Read Also: Dude Review: డ్యూడ్ రివ్యూ

వైసీపీ హయాంలో క్యాలెండర్‌ పెట్టుకుని ఏ నెలలో ఏం పథకం వస్తుందని సంక్షేమ లబ్ధిదారులకు హక్కుగా లభించేలా చేశారు.. అసమానతలు తొలగించి రాజ్యాంగ స్ఫూర్తిని జగన్‌ అమలు చేశారు.. కానీ, జగన్‌ పాలనకు పూర్తి వ్యతిరేకంగా చంద్రబాబు పాలన సాగుతుందన్నారు సజ్జల.. ఏ రకంగా వడపోసి సంక్షేమ పథకాల లబ్ధిదారులను తగ్గించాలనేది చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు.. చంద్రబాబు సంక్షేమం అంతా తన వారికే తప్ప నిజమైన లబ్ధిదారులకు కాదు అని విమర్శించారు. ఎల్లో మీడియా, ఫేక్‌ న్యూస్‌ ఫ్యాక్టరీలు చంద్రబాబు చేతిలో ఉన్నాయి.. ఊతకర్రల సాయంతో కల్లబొల్లిమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. దివ్యాంగుల విషయంలో చంద్రబాబు రాక్షసంగా వ్యవహరిస్తున్నారు. దివ్యాంగులకు ఇచ్చే ఫించన్‌ లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. అసలు దివ్యాంగులకు ఫించన్లు అవసరమా అనేలా చంద్రబాబు పాలన ఉంది.. రీవెరిఫికేషన్‌ పేరుతో దివ్యాంగులను వేధిస్తున్నారని మండిపడ్డారు.

వికలాంగుల విషయంలో జగన్‌ ఏనాడు పార్టీలు చూడలేదన్నారు సజ్జల.. పాలన అనేది ఒక యజ్ఞంలా జగన్‌ భావించారు.. జగన్‌ సంక్షేమ పథకాల డెలివరీ పెడితే చంద్రబాబు లిక్కర్‌ షాప్‌లు, బెల్ట్‌ షాపులు పెట్టి లిక్కర్‌ డెలివరీ చేస్తున్నారని దుయ్యబట్టారు.. పోలీస్‌ వ్యవస్ధను కూడా రెడ్‌ బుక్‌ పేరుతో నాశనం చేశారు. మళ్లీ అధికారం రాదని తెలిసి చంద్రబాబు ఆయన కుమారుడు బరితెగించి వ్యవహరిస్తున్నారు అని ఫైర్‌ అయ్యారు వైసీపీ స్టేట్ కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి..

Exit mobile version