తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల కోసమే కేసీఆర్ వ్యాఖ్యలు.. ఏడు విలీన మండలాల ప్రజలు మళ్ళీ తెలంగాణకు వెళతారా అని ఎవరో అడిగితే మేం వెళ్ళమని స్పష్టం చేశారు అని ఆయన తెలిపారు. అక్కడ ఏం లేవో కూడా చెప్పుకుంటే బాగుంటుంది.. సరిహద్దు గ్రామాల ప్రజలు మాకు జగన్ ముఖ్యమంత్రి గా కావాలి అంటున్నారు.. ఏపీలో పెన్షన్ అద్భుతంగా అమలు అవుతుందని కేసీఆర్ స్వయంగా చెప్పారు.. ఏపీలానే తాము కూడా పెన్షన్లు అమలు చేస్తామని కూడా కేసీఆర్ చెప్పారు.. కోటి 60 లక్షల కుటుంబాల్లో కోటి 40 లక్షల కుటుంబాలకు నేరుగా లబ్ధి జరిగింది అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.
Read Also: North Korea: టెర్రర్ గ్రూపులకు నార్త్ కొరియా ఆయుధాలు.. విక్రయించేందుకు కిమ్ ప్రయత్నం..
ఈ రికార్డును ఎవరూ కాదనలేరు.. తమ ప్రైవేటు వ్యాపారాలను రక్షించుకునే వాళ్ళు హైదరాబాద్ ర్యాలీలో పాల్గొన్నారు అని సజ్జల తెలిపారు. వంద మందో, రెండు వందల మందో చంద్రబాబుకు ర్యాలీకి రాకుండా ఎలా ఉంటారు?!.. వంద వాహనాలు పెడితే రోడ్డు జామ్ కాకుండా ఎలా ఉంటుంది?.. మా ఎమ్మెల్యే వెళితే కూడా అంతకంటే ఎక్కువ మంది వస్తారు అని ఆయన పేర్కొన్నారు. రోగం వచ్చింది, వెంటనే హాస్పిటల్ కు వెళ్ళకపోతే పోతాను అన్నట్లు చెప్పింది చంద్రబాబు.. రోగం వచ్చిందని చెప్పాడు కనుకే 14 గంటలు కారులో ఎలా కూర్చున్నాడని సజ్జల ప్రశ్నించారు. జబ్బులు ఉన్నాయని కోర్టుకు అబద్దాలు చెప్పాడు చంద్రబాబు అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రశ్నించారు. ఆ అబద్దాలతోనే బెయిల్ తెచ్చుకున్నాడు.. ఒక నేరానికి పాల్పడి లోపలికి వెళ్ళాడన్నారు.
Read Also: Tarun Bhascker: పిచ్చోడు… డైరెక్షన్ తప్ప అన్ని చేస్తాడు
అనేక సర్వేల్లో జగన్ కు 60, 70 ప్రజా మద్దతు ఉన్నట్టు తేలుతోంది సజ్జల రామకృష్ణా రెడ్డి వెల్లడించారు. అందుకే పొత్తుల కోసం వాళ్ళు తాపత్రయం పడుతున్నారు.. ఎంత మంది కలిసినా 30 శాతం పంచుకోవటమే.. ఒకవైపు చంద్రబాబు ఉన్నారు… మరోవైపు జగన్ ఉన్నారు అని ఆయన తెలిపారు. మన కోసం నిలబడిన నాయకుడికి మనం మద్దతుగా నిలబడాలి అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు వంచనకు, పెత్తందారి స్వభావానికి ఓటు రూపంలో బుద్ధి చెప్పాలి అని సజ్జల పేర్కొన్నారు.