Site icon NTV Telugu

Saipallavi : మొదటిసారి ఆ హీరోతో రొమాన్స్ చేయబోతున్న సాయి పల్లవి?

Sai Pallavi

Sai Pallavi

టాలీవుడ్ న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. మొదటి సినిమాతోనే యువతను ఫిదా చేసింది.. ఆ తర్వాత ఒక్కో సినిమాతో బాగా ఫేమస్ అవుతూ వస్తుంది..తెలుగు, తమిళంలో స్టార్ హీరోలతో జోడి కడుతూ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. ఇంతవరకు రొమాంటిక్ సాంగ్స్ చెయ్యని ఈ అమ్మడు ఇప్పుడు మొదటి సారి రొమాన్స్ చేయబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి..

అయలాన్‌ చిత్రాల విజయాలతో మంచి ఖుషీగా ఉన్న నటుడు శివకార్తికేయన్‌. నటనకు అవకాశం ఉన్న పాత్రలనే అంగీకరించే నటి సాయిపల్లవి. ఈ రేర్‌ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా అమరన్‌.. కమలహాసన్‌ తన రాజకమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజ్‌ కుమార్‌ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతాన్ని అందిస్తున్న అమరన్‌ చిత్ర షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. ఇందులో నటుడు శివకార్తికేయన్‌ సైనికుడిగా నటిస్తున్నారు. ఆయన భార్య పాత్రలో సాయి పల్లవి నటిస్తుంది..

ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది.. ఒక రొమాంటిక్‌ సాంగ్ ను శివకార్తికేయన్‌, సాయి పల్లవిపై చిత్రీకరించనున్నట్లు తెలిసింది. రొమాంటిక్‌ సాంగ్స్‌లలో సాయిపల్లవి ఇప్పటి వరకు కనిపించింది లేదు.. ఇదే మొదటి సారి.. ఈ సినిమాను అనుకున్న సమయానికే ఆగస్టు లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు..

Exit mobile version