Saindhav : మరికొద్ది గంటల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కు రానున్న సైంధవ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ సైంధవ్.. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైన అయిన ఈ మూవీ ఆశించిన విజయం అందుకోలేకపోయింది.అయితే విక్టరీ వెంకటేష్ చాలా కాలం తర్వాత ఈ మూవీ లో ఊర మాస్ లుక్‌లో కనిపించి అలరించారు.సైంధవ్ మూవీకి హిట్ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్ మరియు టీజర్ తోనే ఈమూవీపై ఆసక్తిని కలిగించారు మేకర్స్. అలాగే ఈ మూవీలోని పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే కంటెంట్ బలంగా ఉన్నా కానీ సంక్రాంతి బరిలో ఏకంగా నాలుగు సినిమాలు పోటీ పడడంతో ఈ మూవీ అనుకున్నంత కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. కానీ ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ మరియు యాక్షన్ ఎపిసోడ్స్ బాగా క్లిక్ అయ్యాయి.ఇదిలా ఉంటే సైంధవ్ మూవీ రిలీజ్ అయి నెల రోజులు కాకుండానే ఓటీటీలోకి వచ్చేస్తోంది. మరికొన్ని గంటల్లోనే ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ ఫిబ్రవరి 3 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. అంటే ఫిబ్రవరి 2 అర్ధరాత్రి నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.
కూతురి ప్రాణాలను కాపాడుకోవడానికి ఓ తండ్రి చేసే పోరాటమే ‘సైంధవ్’. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, ఆండ్రియా జెర్మియా, నవాజుద్ధీన్ సిద్ధిఖీ, ఆర్య, రుహానీ శర్మ మరియు బేబీ సారా కీలక పాత్రలలో నటించారు.ఈ చిత్ర కథ విషయానికి వస్తే.. తన కూతురికి అరుదైన జబ్బు ఉందని వెంకటేష్ కు తెలుస్తుంది. ఆ సమస్య నుంచి తన కూతురిని రక్షించుకోవాలంటే రూ. 17 కోట్ల విలువైన ఇంజక్షన్ కావాలి. దీంతో తన కూతురిని ఎలా కాపాడుకోవాలని అని బాధపడుతుండగా.. అదే జబ్బుతో ఇంకా చాలా మంది చిన్నారులు బాధపడుతున్నారని తెలుసుకుంటాడు. అదే సమయంలో కొందరు టెర్రరిస్టులు వెంకీని చూసి భయపడుతుంటారు. ఇంతకీ వారికి వెంకీ వున్న సంబంధం ఏంటీ ?.. తన చిన్నారిని ఎలా కాపాడుకుంటాడు..అనేది సైంధవ్ మూవీ ప్రధాన కథ.. మరి థియేటర్స్ లో అంతగా ఆకట్టుకోని సైంధవ్ ఓటీటీ ప్రేక్షకులను అయిన మెప్పిస్తుందో లేదో చూడాలి..
Also Read
- Vijaya Dairy Election: విజయ డెయిరీ ఎన్నికపై టీడీపీలో హైడ్రామా.. ఆస్పత్రిలో చైర్మన్ చలసాని!
- Bhindi Red Chilli Pachadi: వేడి వేడి అన్నంలో 'బెండకాయ పచ్చడి' వేసుకొని తింటే.. అబ్బో రుచి అదుర్స్ అంతే.!
- Hyderabad: ఆ కత్తి ఎక్కడుంది?.. ఐఫోన్ ఏమైంది?.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని స్వయంగా విచారించిన సీపీ సజ్జనార్
- Rentachintala-Kurnool Murders: రెంటచింతలలో వైసీపీ నేత.. కర్నూలులో టీడీపీ కార్యకర్త హత్య!
తాజావార్తలు
-
Vijaya Dairy Election: విజయ డెయిరీ ఎన్నికపై టీడీపీలో హైడ్రామా.. ఆస్పత్రిలో చైర్మన్ చలసాని!
-
Bhindi Red Chilli Pachadi: వేడి వేడి అన్నంలో ‘బెండకాయ పచ్చడి’ వేసుకొని తింటే.. అబ్బో రుచి అదుర్స్ అంతే.!
-
Hyderabad: ఆ కత్తి ఎక్కడుంది?.. ఐఫోన్ ఏమైంది?.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని స్వయంగా విచారించిన సీపీ సజ్జనార్
-
R Praggnanandhaa: చెస్ వరల్డ్ లో భారత్ ఆధిపత్యం.. సెయింట్ లూయిస్ రాపిడ్ అండ్ బ్లిట్జ్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానంద
-
Rentachintala-Kurnool Murders: రెంటచింతలలో వైసీపీ నేత.. కర్నూలులో టీడీపీ కార్యకర్త హత్య!
ట్రెండింగ్
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్‌ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!