NTV Telugu Site icon

Saina Nehwal: విద్యార్థులు క్రీడల్లో రాణించేందుకు తల్లిదండ్రులు ప్రోత్సహించాలి: సైనా

Saina Nehwal Speech

Saina Nehwal Speech

Saina Nehwal React on Vinesh Phogat Verdict: ప్రస్తుతం విద్యార్థులు క్రీడల్లో రాణించేందుకు వారి తల్లిదండ్రులు ప్రోత్సహించాలని స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ సూచించారు. క్రీడలకు ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. బ్యాడ్మింటన్ తన ఆత్మలో ఉందని, ఎప్పటికీ వదిలిపెట్టను అని చెప్పారు. రెజ్లర్ వినేష్ ఫోగట్‌కు పతకం వస్తుందని తాను ఆశిస్తున్నా అని సైనా నెహ్వాల్ పేర్కొన్నారు. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో మహిళల సింగిల్స్‌లో సైనా కాంస్య పతకం కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

మణికొండ మున్సిపల్ పరిధిలోని అల్కాపురి కాలనీలో ఏర్పాటు చేసిన ఓ స్పోర్ట్స్ షాప్‌ను సైనా నెహ్వాల్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సైనా మాట్లాడుతూ… ‘నేను బ్యాడ్మింటన్‌ను ఎప్పటికీ వదిలిపెట్టను. నా భర్త పారుపల్లి కశ్యప్ కూడా ఇదే రంగంలో కోచింగ్ ఇస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థులు క్రీడలో రాణించేందుకు వారి తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. క్రీడలకు ఉజ్వల భవిష్యత్తు ఉంది. పిల్లలకు పౌష్టికాహారం అందించి ఎప్పుడు ఫిట్‌గా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే’ అని అన్నారు.

Also Read: Luana Alonso: నెయ్‌మర్ నుంచి ప్రైవేట్‌ మెసేజ్‌ వచ్చింది.. బాంబ్ పేల్చిన ఒలింపిక్స్‌ బ్యూటీ!

‘ఓ క్రీడాకారిణిగా చెబుతున్నా.. పారిస్ ఒలింపిక్స్‌లో మనోళ్లు బాగా ఆడారు. మెడల్స్ కూడా వచ్చాయి. వినేష్ ఫోగట్ తీర్పు నేడు రానుంది. పతకం వస్తుందని నేను ఆశిస్తున్నా. మనం గోల్డ్ మెడల్ మిస్ అయ్యాం. స్వర్ణ పతకంకు దగ్గరకు వెళ్ళాము. నేడు తీర్పు అనుకూలంగా వస్తుందనుకుంటున్నా. భారత్ ఖాతాలో మరో పతకం చేరుతుందని ఆశిస్తున్నా’ అని సైనా నెహ్వాల్ చెప్పుకొచ్చారు.

Show comments