Site icon NTV Telugu

Saina Nehwal: నెల క్రితమే విడాకులు.. శుభవార్త చెప్పిన సైనా నెహ్వాల్!

Saina Nehwal, Parupalli Kashyap

Saina Nehwal, Parupalli Kashyap

Saina Nehwal Hints at Reunion with Parupalli Kashyap After Divorce: బ్యాడ్మింటన్ ప్లేయర్స్ సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ జంట విడిపోయిన విషయం తెలిసిందే. భర్త పారుపల్లి కశ్యప్‌తో తాను విడిపోతున్నట్లు జులై 13న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా సైనా ప్రకటించారు. అయితే నెల కూడా కాకముందే సైనా అభిమానులకు ఓ శుభవార్త చెప్పారు. కశ్యప్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసి.. దూరం దగ్గర చేసింది అని క్యాప్షన్‌ ఇచ్చారు. తాము మరలా కలిసిపోతామని సైనా చెప్పకనే చెప్పారు.

పారుపల్లి కశ్యప్‌తో కలిసి దిగిన ఫొటోలను సైనా నెహ్వాల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ‘కొన్నిసార్లు దూరం సన్నిహితుల విలువను మనకు నేర్పుతుంది. కలిసి ఉండేందుకు మేము మరలా ప్రయత్నం చేస్తున్నాం’ అని సైనా రాసుకొచ్చారు. పోస్టుకు రెండు హార్ట్‌ ఎమోజీలను జత చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఫాన్స్ అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘భోలేనాథ్ మీతో ఉన్నాడు, చాలా సంతోషం’, ‘హ్యాపీ ఫర్ బోత్ ఆఫ్ యూ’, ‘మీరు మరలా కలవాలని కోరుకుంటున్నాను’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Yashasvi Jaiswal: జైస్వాల్‌ సెంచరీ.. గవాస్కర్ రికార్డు సమం, సచిన్ రికార్డు బ్రేక్!

సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ చాలా ఏళ్లు ప్రేమించుకుని 2018లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. కెరీర్‌ పరంగా ఒకరికొరు అండగా ఉంటూ.. టోర్నీలు ఆడారు. ఉన్నపళంగా సైనా విడాకుల ప్రకటన చేసి అందరికీ షాక్ ఇచ్చారు. ఇప్పుడు మరలా కశ్యప్‌ను చాలా మిస్ అవుతున్నానని, మరలా కలిసేందుకు ప్రయత్నిస్తున్నాం అని పేర్కొన్నారు. ప్రస్తుతం సైనా తన ఫామ్‌ను కోల్పోయారు. చివరిసారిగా 2023 జూన్‌లో ప్రొఫెషనల్‌ సర్క్యూట్‌లో ఆడారు. మరోవైపు కశ్యప్‌ కాంపిటీటివ్‌ బ్యాడ్మింటన్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

Exit mobile version