తెలుగు సినిమా పరిశ్రమలో హిట్ కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న దర్శకుడు శైలేష్ కొలను, తాజాగా తన కొత్త ప్రణాళికలను వెల్లడించారు. హిట్ సిరీస్‌తో సినీ ప్రియుల మనసులో స్థానం సంపాదించిన ఈ యువ దర్శకుడు, సిడ్నీలో ఆరు నెలల పాటు ఉంటూ కొత్త స్క్రిప్ట్ రాసుకుంటానని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన మాటలు సినీ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తాజాగా హిట్ 4 సూపర్ హిట్ అయిన క్రమంలో మీడియాతో మాట్లాడిన ఆయన కీలక విషయాలు పంచుకున్నారు. “#HIT4 కోసం నాకు కొన్ని ఆసక్తికరమైన ఆలోచనలున్నాయి. అంతేకాక, ఒక మంచి రొమాంటిక్ కామెడీ సినిమా రాయాలని కూడా అనుకుంటున్నాను,” అని శైలేష్ అన్నారు. సైలేష్ కొలను గతంలో హిట్ (2020), హిట్ 2 (2022), హిట్ 3(2025) చిత్రాలతో థ్రిల్లర్ జానర్‌లో తనదైన ముద్ర వేశారు.
Read More: Manju Warrier : స్టార్ హీరోయిన్ నడుము గిల్లిన వ్యక్తి.. వీడియో వైరల్..
విశ్వక్ సేన్, అడివి శేష్, నాని హీరోలుగా రూపొందిన ఈ చిత్రాలు, క్రైమ్ థ్రిల్లర్ అభిమానులను ఆకర్షించడమే కాక, కథనం, పాత్రల చిత్రణలో సైలేష్ ప్రతిభను చాటాయి. ఇప్పుడు #HIT4 కోసం కొత్త ఆలోచనలతో సిడ్నీకి వెళ్తున్నారని చెప్పడం, ఈ సిరీస్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. హిట్ సిరీస్‌లోని మునుపటి చిత్రాలు ఉత్కంఠభరితమైన కథాంశాలు, ఊహించని ట్విస్ట్‌లతో ప్రేక్షకులను అలరించాయి. ఈ నేపథ్యంలో, #HIT4 ఎలాంటి కథతో మన ముందుకు వస్తుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే, శైలేష్ ప్రణాళికలు కేవలం #HIT4తోనే ఆగలేదు. ఆయన ఒక రొమాంటిక్ కామెడీ చిత్రం రాయాలనే తన ఆలోచనను కూడా పంచుకున్నారు. ఇప్పటివరకు థ్రిల్లర్ జానర్‌లో తన సత్తా చాటిన సైలేష్, రొమాంటిక్ కామెడీ లాంటి పూర్తిగా భిన్నమైన శైలిలో సినిమా తీయాలనుకోవడం ఆసక్తికరం.
