సైఫ్ అలీఖాన్‌ను లీలావతి ఆస్పత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ కోరిక నెరవేరింది. భజన్ సింగ్ రాణా అనే ఆటో డ్రైవర్‌ని డిశ్చార్జ్ చేయడానికి ముందు సైఫ్ కలుసుకుని కౌగిలించుకున్నాడని ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇంతకుముందు డ్రైవర్ ఇంటర్వ్యూలో సైఫ్ ను తాను ఆసుపత్రికి తీసుకువెళ్లినా ఆయన్ను కలిసి అవకాశం దొరకలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఆ సమయంలో తాను ఆసుపత్రికి తీసుకువెళ్లింది నటుడు సైఫ్ అలీఖాన్ అని ఆటో డ్రైవర్ కి తెలియదట. ఆంధ్ర మాట్లాడుతూ సైఫ్ తో తన ఫోటో దిగాలని అనుకుంటున్నట్లు వెల్లడించాడు. ఇప్పుడు సైఫ్ కూడా తనతో ఫోటో దిగాలనే అతని కోరికను తీర్చాడు. సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగినప్పుడు, అతని ఇంట్లో కారు సిద్ధంగా లేదు. ఆటో డ్రైవర్ అతన్ని లీలావతి ఆసుపత్రికి తీసుకెళ్లాడు.
READ MORE: KTR: మళ్ళీ కేసీఆర్ను సీఎంను చేసుకునే దాకా విశ్రమించకుండా పోరాడుదాం..
ఈ ఘటనను ఆటో డ్రైవర్ ఓ ఇంటర్వ్యూలో వివరించాడు. సైఫ్‌ను త్వరగా ఆస్పత్రికి తరలించేందుకు షార్ట్‌కట్ తీసుకున్నానని, డబ్బులు కూడా తీసుకోలేదని పేర్కొన్నాడు. ఇప్పుడు వీరి ఫోటో బయటకు వచ్చింది. ఇందులో సైఫ్ హాస్పిటల్‌లో ఆటో డ్రైవర్‌తో కనిపించాడు. డ్రైవర్ భజన్ సింగ్ రానాను సైఫ్ కౌగిలించుకుని కృతజ్ఞతలు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఇది మాత్రమే కాదు, తనకు ఎప్పుడైనా ఏదైనా అవసరమైతే తెలియజేయమని సైఫ్ చెప్పినట్లు భజన్ లాల్ మీడియాకు తెలిపారు. ఆ రాత్రి ఒక మహిళ తన ఆటోను ఆపిందని భజన్ సింగ్ చెప్పాడు. సైఫ్‌ను ఆటోలో కూర్చోబెట్టి చూడగా మెడ, వీపు నుంచి రక్తం కారుతోంది, తెల్లని కుర్తా ఎర్రగా మారిపోయింది. ఇక ఆసుపత్రికి తీసుకు వెళ్లినందుకు తాను ఎలాంటి ఛార్జీలు తీసుకోలేదని, ఎవరికైనా సహాయం చేయడానికి సంతోషంగా ఉంటానని భజన్ సింగ్ చెప్పాడు. భజన్ సింగ్ తన ఆటో ఎక్కింది సైఫ్ అనే విషయం తెలియదని, అలాంటి పరిస్థితుల్లో సెల్ఫీ కూడా తీసుకోలేనని చెప్పాడు.