Site icon NTV Telugu

Sai Sudharsan: ఐపీఎల్‌లో మొదటి బ్యాటర్‌గా సాయి సుదర్శన్‌.. క్రిస్‌ గేల్‌ రికార్డు బ్రేక్!

Sai Sudharsan

Sai Sudharsan

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో యువ సంచలనం సాయి సుదర్శన్‌ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే వేదికపై వరుసగా ఐదుసార్లు 50+ స్కోర్లు చేసిన ఏకైక భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఐపీఎల్‌ 2025 సీజన్‌లో భాగంగా బుధవారం రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ (82; 53 బంతుల్లో 8×4, 3×6) హాఫ్ సెంచరీ బాదడంతో ఈ రికార్డు అతడి ఖాతాలో చేరింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో సాయి వరుసగా హాఫ్ సెంచరీలు బాదాడు.

సొంత మైదానం నరేంద్ర మోడీ స్టేడియంలో సాయి సుదర్శన్‌ రెచ్చిపోతున్నాడు. ఐపీఎల్ 2025లోని మూడు మ్యాచ్‌లలో, ఐపీఎల్ 2024లోని చివరి రెండు మ్యాచ్‌లలో అర్ధ శతకాలు బాదాడు. ఐపీఎల్ 2025లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియంలో రాజస్థాన్‌ రాయల్స్‌పై 82, ముంబై ఇండియన్స్‌పై 63, పంజాబ్ కింగ్స్‌పై 74 రన్స్ చేశాడు. ఐపీఎల్ 2024లో చివరి మూడు మ్యాచ్‌లలో రెండు శతకాలు చేశాడు. కేకేఆర్‌పై మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. అంతకుందు చెన్నైపై 103, బెంగళూరుపై 84 రన్స్ బాదాడు. ఈ రికార్డ్స్ చూస్తే.. నరేంద్ర మోడీ స్టేడియం అంటేనే సాయి ఊగిపోతున్నాడు.

Also Read: Rajasthan Royals: ఓటమి బాధలో ఉన్న రాజస్థాన్‌కు భారీ షాక్!

ఐపీఎల్‌లో సాయి సుదర్శన్‌ మరో రికార్డు కూడా నెలకొల్పాడు. 30 ఇన్నింగ్స్‌ తర్వాత అత్యధిక పరుగులు చేసిన రెండు బ్యాటర్‌గా నిలిచాడు. 30 ఇన్నింగ్స్‌ తర్వాత సాయి 1307 పరుగులు బాదాడు. ఈ జాబితాలో షాన్‌ మార్ష్‌1338 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు. క్రిస్‌ గేల్‌ (1141 పరుగులు) మూడో స్థానంలో, కేన్‌ విలియమ్సన్‌ (1096 పరుగులు) నాలుగో స్థానంలో, మ్యాథ్యూ హెడెన్‌ (1082 పరుగులు) అయిదో స్థానంలో ఉన్నాడు.

Exit mobile version