Sai Pallavi: సీత పాత్ర ట్రోల్స్.. పెదవి విప్పిన సాయి పల్లవి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sai Pallavi: బాలీవుడ్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘రామాయణ పార్ట్ 1’ ఇటీవలే రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద వరుసగా రికార్డులను బ్రేక్ చేస్తోంది. సినిమా విడుదలై నెల కావొస్తున్నా సినిమాకు కలెక్షన్స్ తగ్గలేదు. ఈ మూవీలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటించగా.. ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. నార్త్ అమెరికాలో ఏకంగా 30 మిలియన్ డాలర్ల మైలురాయిని దాటి, ఈ ఘనత సాధించిన ఏకైక భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించింది. అటు తెలుగు రాష్ట్రాల్లోనూ డబ్బింగ్ చిత్రాల్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తూ రూ. 80 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
ఈ సినిమాలో రావణుడిగా యష్ నటనకు ప్రశంసల వర్షం కురుస్తుండగా, రాముడిగా రణ్‌బీర్ కపూర్ లుక్స్, నటన ఆకట్టుకున్నాయి. అయితే సీత పాత్రలో నటించిన సాయి పల్లవిపై మాత్రం సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్, విమర్శలు వచ్చాయి. తాజాగా ఈ విమర్శలపై సాయి పల్లవి స్పందించారు. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న చర్చల గురించి తనకు పూర్తి అవగాహన ఉందని సాయి పల్లవి స్పష్టం చేశారు. అసలు సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో నాకు తెలియదని కాదు. సీత పాత్రలో నా నటనపై వస్తున్న విమర్శలు నా వరకు చేరుతున్నాయి. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. వాటిని కేవలం అభిప్రాయాలుగానే పరిగణించాలి. విమర్శలను ఎదుర్కొని, మరింత దృఢంగా మారి ముందుకు సాగే ధైర్యాన్ని పెంచుకోవాలి. అప్పుడే అవి మనల్ని ప్రభావితం చేయకుండా మన ప్రయాణాన్ని కొనసాగించగలం అని బదులిచ్చారు.
Also Read
- KTR: డీలిమిటేషన్‌తో తెలంగాణలో 180 అసెంబ్లీ స్థానాలు.. 26 లోక్‌సభ సీట్లు పెరుగుతాయ్..!
- Bollywood Villains in Tollywood: టాలీవుడ్లో తేలిపోతున్న బాలీవుడ్ యంగ్ విలన్లు!
- Delimitation 2026: డీలిమిటేషన్‌పై విపక్షాల ప్రధాన ఆందోళన ఇదే! అసలు జెర్రీమాండరింగ్ అంటే ఏంటి?
- CM Chandrababu: సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. కూటమి ఎంపీలకు కీలక ఆదేశాలు!
కేవలం అందం, గ్లామర్‌కే పరిమితమయ్యే పాత్రలు చేయడంలో తనకు ఏమాత్రం ఆసక్తి లేదని ఈ నేచురల్ బ్యూటీ తేల్చి చెప్పారు. ఒక నటిగా సాధారణ పాత్రలకు పరిమితం కాకుండా, సవాలు విసిరే పాత్రలను స్వీకరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. తన పదేళ్ల సినీ ప్రయాణంలో మంచి పాత్రల కోసం దాదాపు నాలుగైదేళ్ల పాటు ఎదురుచూడాల్సి వచ్చిందని ఆమె గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో అవకాశాలు వస్తాయో లేదో తెలియక మానసికంగా ఎంతో ఇబ్బంది పడినట్లు సాయి పల్లవి తెలిపారు. అయినప్పటికీ, అందరూ చేస్తున్నారని తానూ అలాంటి పాత్రలు చేస్తే, సినిమా విడుదలయ్యాక తనను తాను అంగీకరించలేనని భావించినట్లు చెప్పారు.
ఏదేమైనా ‘రామాయణ’లో సీత పాత్ర చేయడం తన జీవితంలో పెను మార్పు తీసుకొచ్చిందని, తన కెరీర్లో ఇదొక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోతుందని ఆమె పేర్కొన్నారు. సాయి పల్లవి రిప్లై ట్రోలర్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ గా మారింది. మరి ఇప్పటికైనా ట్రోల్స్ ఆగుతాయేమో చూడాలి. ఇక సాయి పల్లవి ప్రస్తుతం భారీ ప్రాజెక్టులను లైన్లో పెట్టుకుంటూ బిజీగా మారుతుంది. నెక్స్ట్ ఎలాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుందో అన్నది ఆసక్తిగా మారింది..
తాజావార్తలు
-
Sai Pallavi: సీత పాత్ర ట్రోల్స్.. పెదవి విప్పిన సాయి పల్లవి..!
-
KTR: డీలిమిటేషన్‌తో తెలంగాణలో 180 అసెంబ్లీ స్థానాలు.. 26 లోక్‌సభ సీట్లు పెరుగుతాయ్..!
-
Bollywood Villains in Tollywood: టాలీవుడ్లో తేలిపోతున్న బాలీవుడ్ యంగ్ విలన్లు!
-
Delimitation 2026: డీలిమిటేషన్‌పై విపక్షాల ప్రధాన ఆందోళన ఇదే! అసలు జెర్రీమాండరింగ్ అంటే ఏంటి?
-
CM Chandrababu: సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. కూటమి ఎంపీలకు కీలక ఆదేశాలు!
ట్రెండింగ్
-
MS Dhoni: ‘7’ నంబర్‌పై ధోనీ షాకింగ్ కామెంట్స్.. దాని వెనుక లాజిక్ ఇదే అంటూ..!
-
IND vs NZ: ముగిసిన మూడో రోజు ఆట.. భారీ ఆధిక్యం దిశగా న్యూజిలాండ్..!
-
11,000mAh బ్యాటరీ, 7 అంగుళాల భారీ డిస్ప్లేతో రానున్న Redmi Turbo 6 Max..!
-
Jasprit Bumrah Unwanted Record: 292 బంతుల తర్వాత.. జస్ప్రీత్ బుమ్రా కెరీర్లోనే చెత్త రికార్డు!
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, 50MP పెరిస్కోప్ కెమెరాతో Vivo X500e లాంచ్..!