NTV Telugu Site icon

Sai Pallavi : విరాటపర్వం సినిమా పై ఆసక్తి కర పోస్ట్ చేసిన సాయిపల్లవి..

Whatsapp Image 2023 06 18 At 12.23.34 Pm

Whatsapp Image 2023 06 18 At 12.23.34 Pm

`విరాటపర్వం` చిత్రంలో సాయి పల్లవి వెన్నెల పాత్రలో ఎంతగానో ఆకట్టుకున్న సంగతి అందరికి తెలిసిందే.చివిరి వరకు ఎంతో ఎమోషనల్‌గా సాగే ఆమె పాత్ర ప్రేక్షకుల మదిలో బలమైన ముద్ర ను వేసుకుంది.ఆ పాత్రలో సాయిపల్లవి జీవించిందని చెప్పాలి.వెన్నెల పాత్రకి సాయి పల్లవి ప్రాణం పోసింది. విమర్శల నుంచి ప్రశంసలు కూడా అందుకుంది. `విరాటపర్వం` సినిమాలో ఆమె నటనే సినిమాకు ప్లస్ గా మారింది.. ఈ సినిమా కమర్షియల్‌గా మాత్రం అంతగా ఆడలేదు, కానీ విమర్శలకు నుంచి ఎన్నో ప్రశంసలు అందుకుంది. అభ్యూదయవాదుల ప్రశంసలు అందుకుంది.అందులోనూ ముఖ్యంగా సాయిపల్లవి నటన అందరిని కూడా ఫిదా చేసిందని చెప్పవచ్చు.

తాజాగా `విరాటపర్వం` విడుదలై ఏడాది పూర్తి అయింది.గత సంవత్సరం జూన్‌ 17న ఈ చిత్రం విడుదలైంది. వేణు ఉడుగుల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇందులో హీరోగా రానా నటించగా, ప్రియమణి, నవీన్‌ చంద్ర మరియు నివేతా పేతురాజ్‌ ముఖ్య పాత్రలు పోషించారు.. ఈ సినిమా శనివారం తో సంవత్సరం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సాయిపల్లవి ట్విట్టర్‌లో పోస్ట్ ను పెట్టింది. `విరాటపర్వం` సినిమా తన మనసుకు ఎంతో దగ్గరైన సినిమా అని ఆ సినిమా సంవత్సరం పూర్తి చేసుకున్నందుకు మూవీ టీం కి శుభాకాంక్షలు అని తెలిపింది.`విరాటపర్వం` సినిమా ఎప్పుడూ నా హృదయానికి దగ్గరగా ఉంటుంది అని ఆమె పేర్కొంది. అంతేకాదు మీకు వెన్నెల హాయ్ చెబుతుంది అని లవ్‌ ఎమోజీలను కూడా పంచుకుంది సాయిపల్లవి. మరోవైపు సినిమాలోని తన స్టిల్స్ ను షేర్‌ చేసింది.. ప్రస్తుతం ఆమె పోస్ట్ నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది.మరోవైపు చిత్ర దర్శకుడు వేణు ఉడుగుల అంతకు ముందు ట్విట్టర్‌ ద్వారా ఎమోషనల్‌ పోస్ట్ ను చేసారు.`విరాటపర్వం` విడుదలై సంవత్సరం పూర్తయింది. విరాట పర్వానికి ముందు ఉన్న ‘నేను’ దాని విడుదల తర్వాత ఉన్న ‘నేను’ ఒకటి అయితే కాదు. విరాటపర్వం నాకు అందమైన అనుభూతుల్ని ఇచ్చింది. ఎందరో ప్రేక్షకుల అభిమానాన్ని, ప్రేమను కూడా ఇచ్చింది. అదే సమయంలో మార్కెట్ కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో కూడా రుచి చూపించింది.నా కాలి కింద మందుపాతర పేలినట్టు అయింది.కొన్ని నెలలపాటు నాకు నిద్ర లేని రాత్రులను మిగిల్చింది. నన్ను కొత్త ఆలోచనలో కూడా పడేసింది. నాకు ఓటమి విలువ ఎంతో గొప్పదో చెప్పుకొచ్చింది అంటూ పోస్ట్ చేసాడు దర్శకుడు..