Site icon NTV Telugu

Sai Durgha Tej : మరో సారి తన మంచి మనసు చాటుకున్న సాయి దుర్గ తేజ్.. పిల్లల కోసం విరాళం

New Project (20)

New Project (20)

Sai Durgha Tej : మెగా మేనల్లుడు, హీరో సాయి ధరమ్ తేజ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిత తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తన మేనమామ మేనరిజం, డ్యాన్స్ లతో ప్రేక్షకుల్లో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. నిత్యం తన కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతాడు సాయి దుర్గా తేజ్.

Read Also:Galaxy S23 FE Price: 62 శాతం తగ్గింపు.. 30 వేలకే ‘గెలాక్సీ ఎస్‌23 ఎఫ్‌ఈ’! బ్యాంకు ఆఫర్స్ అదనం

ప్రస్తుతం సాయి దుర్గ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తన మామయ్యల లాగే సమాజానికి ఏదో ఒకటి చేయాలన్న తపన కలిగి ఉంటాడు. తరచూ సేవా కార్యక్రమాల్లో పాల్గొటాడు సాయి తేజ్. ఇటీవల వరద బాధితులకు రెండు రాష్ట్రాలకు 20 లక్షల రూపాయలు విరాళం ఇచ్చిన సంగతి తెలసిందే. అలాగే అమ్మ అనాధాశ్రమానికి, పలు సేవా సంస్థలకు 5 లక్షలు విరాళం ఇచ్చారు. ఇలా రెగ్యులర్ గా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ, విరాళాలు ఇస్తున్న సాయి దుర్గా తేజ్ తాజాగా మరో ఫౌండేషన్ కి తన వంతుగా విరాళం అందించాడు.


Read Also:Road Accident: ఘోర ప్రమాదం.. ట్రక్కును ఢీకొన్న బస్సు.. తొమ్మిది మంది మృతి!

నేడు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ నిర్వహించిన పిల్లలకు వచ్చే గుండె రోగాల అవగాహన కార్యక్రమంలో సాయి దుర్గ తేజ్ ఫ్యామిలీతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అక్కడి పిల్లలతో సరదాగా కాసేపు ముచ్చట్లు పెట్టారు, వారితో కలిపి ఫొటోలు దిగారు సాయి దుర్గ తేజ్ కుటుంబం. ఈ సందర్భంగా సాయి దుర్గ తేజ్ ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ కు 5 లక్షల రూపాయలు విరాళం అందజేశారు. వీటికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సాయి దుర్గ తేజ్ మంచి మనుసుకి మరోసారి ఫ్యాన్స్, నెటిజన్లు అభినందిస్తున్నారు.

Exit mobile version