Site icon NTV Telugu

Sai Dharam Tej : మామ కోసం బరిలోకి సాయి ధరంతేజ్.. వాళ్లందరికీ భిన్నంగా?

Pawan Saidharam

Pawan Saidharam

ఏపీలో ఎన్నికల నగరా మోగింది.. రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నారు.ఆంధ్ర ప్రదేశ్ లో లోక్ సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ ముగిసి ప్రధానపార్టీల ప్రచారం జోరందుకుంది. దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో ఎన్నికలు జరుగుతుండగా ఆంధ్ర ప్రదేశ్ లో నాలుగో విడతలో వున్నాయి… అంటే మే 13న పోలింగ్ జరగనుంది.. రోజు రోజుకు ఉత్కంఠగా ప్రచారాలు జరుగుతున్నాయి..

టీడీపీ, జనసేన పొత్తు పై ప్రచారం చేస్తున్నారు.. జనసేన ఇప్పుడు ఏపీలో జెండాను పాతాలని తెగ ప్రయత్నాలు చేస్తుంది.. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటి చేస్తున్నారు.. ఆయనకు ప్రచారంలో సపోర్ట్ చేసేందుకు ఇప్పటికే సినీ, రాజకీయ అభిమానులు పిఠాపురం ప్రచారం చేస్తున్నారు.. ఇప్పుడు మెగా హీరో మామ కోసం బరిలోకి దిగాడు.. పిఠాపురం ఎన్నికల ప్రచారం జోరందుకుంది.. పవన్ కళ్యాణ్ కు మద్దతుగా సినీ తారలు ప్రచారంలో పాల్గొంటున్నారు…

మెగా కుటుంబం నుంచి హీరోలు పవన్ కోసం ప్రచారంలో పాల్గొంటున్నారు.. తాజాగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ప్రచారం లో పాల్గొనబోతున్నారు.. ఇతని తమ్ముడు వైష్ణవ తేజ్ కానీ అంతకుముందు వచ్చిన వరుణ్ తేజ్ కానీ కేవలం పిఠాపురంలో మాత్రమే ప్రచారం చేశారు.. కానీ ఈ హీరో మాత్రం మచిలీపట్నం, పిఠాపురం,కాకినాడ మూడు రోజులు మూడు వేరువేరు ప్రాంతాలలో ప్రచారం చేస్తున్నాడని తెలుస్తుంది.. ఇక అలాగే మెగా హీరోలు అందరు ప్రచారంలో పాల్గొనబోతున్నారని సమాచారం..

Exit mobile version