NTV Telugu Site icon

Dakshina : ఆసక్తి రేకేత్తిస్తున్న సాయి ధన్సిక “దక్షిణ” ట్రైలర్

Whatsapp Image 2024 05 15 At 12.28.52 Pm

Whatsapp Image 2024 05 15 At 12.28.52 Pm

నటి సాయి ధన్సికా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తిరుడి చిత్రంతో కోలీవుడ్ కి పరిచయం అయిన ఈ భామ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన కబాలి సినిమాలో ముఖ్య పాత్ర పోషించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఈ భామ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సైకో థ్రిల్లర్ “దక్షిణ”.ఈ చిత్రాన్ని మంత్ర,మంగళ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన ఓషో తులసీరామ్ తెరకెక్కించారు.ఈ చిత్రాన్ని కల్ట్ కాన్సెప్ట్స్ పతాకంపై అశోక్ షిండే నిర్మించారు.

రీసెంట్ గా ఈ చిత్ర ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు.ఈ ట్రైలర్ లో ఓ సైకో కొంత మందిని అతి క్రూరంగా చంపుతుంటాడు.అస్సలు అతను సైకో గా ఎలా మారాడు అతడిని ఎలా పట్టుకున్నారనేది ఈ సినిమా ప్రధానాంశంగా వుంది.ప్రస్తుతం ఈ ట్రైలర్ ఎంతో ఆసక్తి రేకెత్తిస్తున్నది.ఈ చిత్రంలో సాయి ధన్సిక సైకోను పట్టుకునే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు ..ఆవేశంతో చంపేవాడికి ,ఆనందం కోసం చంపేవాడికి చాల తేడా ఉంటుంది అంటూ వచ్చే ఈ సినిమా డైలాగ్ ఎంతో ఆసక్తి రేకెత్తిస్తుంది.ట్రైలర్ లో సైకో వివిధ రకాలుగా మనుషులను చంపుతారో చూపించారు.ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలోతెగ వైరల్ అవుతుంది.

Show comments