NTV Telugu Site icon

Sachin Tendulkar : సచిన్ టెండూల్కర్ @50.. ‎బర్త్ డే గిఫ్ట్‎గా భారీ విగ్రహం

Sachin

Sachin

Sachin Tendulkar : భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఈ ఏడాది ఏప్రిల్ 24న తన 50వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) వాంఖడే స్టేడియంలో టెండూల్కర్ నిలువెత్తు విగ్రహాన్ని ఆవిష్కరించనుంది. ఈ నిర్ణయాన్ని ఎంసీఏ అధ్యక్షుడు అమోల్ కాలే మంగళవారం (ఫిబ్రవరి 28) న ప్రకటించారు. వాంఖడే స్టేడియంలో ఒక ఆటగాడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఇది తొలిసారి.

Read Also: Joginipalli Santosh Kumar: నా జీవితంలో పెట్లబుర్జు ఆస్పత్రికి ప్రత్యేక స్థానం

ఈ ఏడాది ఎంసీఏ గోల్డ్‌ జూబ్లీ ఇయర్‌ ఉత్సవాలను నిర్వహించబోతున్నది. 2023 క్రికెట్‌ వరల్డ్‌కప్‌ సందర్భంగా ఎంసీఏ లాంజ్‌ బయట ఉన్న సర్క్యులర్‌ ప్లాట్‌ఫామ్‌పై సచిన్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు అమోల్‌ కాలే తెలిపారు. ఆ ఉత్సవాల్లో భాగంగానే సచిన్‌ టెండూల్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ విషయాలను అమోల్‌ కాలే మీడియాకు సచిన్‌ టెండూల్కర్‌ తో పాటు వెల్లడించారు. సచిన్‌ కూడా మీడియాతో వాంఖడే స్టేడియం తనకు ఎంతో ప్రత్యేకం అని చెప్పాడు. తన తొలి రంజీ మ్యాచ్‌, ఆఖరి ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ ఇదే వేదికపై ఆడానని తెలిపాడు.

Read Also:Gold Mines : ఒడిశాలో గోల్డ్.. తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంత

సచిన్‌ తన అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌లో మొత్తం 200 టెస్ట్‌ మ్యాచ్‌లు, 463 వన్డే మ్యాచ్‌లు, ఒక టీ20 మ్యాచ్‌ ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిసి మొత్తం 34,357 పరుగులు చేశాడు. అంతేగాక అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలు సాధించి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అదేవిధంగా 2011లో సచిన్‌ వాంఖడే స్టేడియంలో క్రికెట్‌ ప్రపంచకప్‌ను గెలిచాడు.