NTV Telugu Site icon

Sachin Tendulkar Batting: సచిన్ హిట్టింగ్.. 16 బంతుల్లో 27 పరుగులు! వీడియో వైరల్

Sachin Tendulkar 27 Runs Video

Sachin Tendulkar 27 Runs Video

Sachin Tendulkar 27 Runs Video Goes Viral: 2013లో క్రికెట్ దిగ్గజం స‌చిన్ టెండూల్క‌ర్ రిటైర్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆటకు వీడ్కోలు పలికి 10 సంవత్సరాలు అవుతున్నా.. ప్రస్తుతం 50 ఏళ్ల వయసున్నా.. త‌న‌ బ్యాటింగ్‌లో స‌త్తా ఏమాత్రం త‌గ్గిపోలేద‌ని నిరూపించాడు. వ‌న్ వ‌ర‌ల్డ్ వ‌ర్సెస్ వ‌న్ ఫ్యామిలీ టీ20 ఎగ్జిబిష‌న్ మ్యాచ్‌లో సచిన్ హిట్టింగ్ చేశాడు. క‌ర్నాట‌క‌లోని ముద్ద‌న‌హ‌ల్లి సాయి కృష్ణ‌న్ క్రికెట్ స్టేడియంలో జ‌రిగిన మ్యాచ్‌లో స‌చిన్ 16 బంతుల్లో 27 పరుగులు చేశాడు. లిటిల్ మాస్టర్ తన మార్క్ షాట్లతో అలరించాడు. ఇందుకుసంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

మధుసూదన్ సాయి గ్లోబల్ హ్యుమానిటేరియన్ మిషన్‌ ఆధ్వర్యంలో జరిగిన ‘వన్‌ వరల్డ్‌ వన్‌ ఫ్యామిలీ’ కప్‌లో భారత్‌, ఇతర దేశాలకు చెందిన దిగ్గజాలు బరిలోకి దిగారు. సచిన్‌ కెప్టెన్సీలోని వన్‌ వరల్డ్‌, యువరాజ్‌ సింగ్‌ నాయకత్వంలోని వన్‌ ఫ్యామిలీ జట్లు ఫ్రెండ్లీ మ్యాచ్‌. ఆడాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన వన్‌ ఫ్యామిలీ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ ఆటగాడు డారెన్‌ మ్యాడీ (51) హాఫ్ సెంచరీ చేయగా.. భారత్ ఆటగాళ్లు యూసఫ్‌ పఠాన్‌ (38), యువరాజ్‌ సింగ్‌ (23) పరుగులు రాణించారు. వన్‌ వరల్డ్‌ బౌలర్లలో హర్భజన్‌ సింగ్‌ 2 వికెట్స్ తీశాడు.

Also Read: West Indies Retirements: వెస్టిండీస్ జట్టుకు భారీ షాక్.. ఒకేసారి న‌లుగురు క్రికెట‌ర్లు వీడ్కోలు!

181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వన్‌ వరల్డ్ 19.5 ఓవర్లలో విజయాన్ని అందుకుంది. అల్విరో పీటర్సన్‌ (74) హాఫ్ సెంచరీ చేయగా.. సచిన్‌ టెండూల్కర్‌ (27), నమన్‌ ఓఝా (25), ఉపుల్‌ తరంగ (29) రాణించారు. యూసఫ్‌ పఠాన్‌ బౌలింగ్‌లో ఇర్ఫాన్‌ పఠాన్‌ సిక్సర్‌ బాది మ్యాచ్ ముగించాడు. వన్‌ ఫ్యామిలీ బౌలర్లలో చమింద వాస్‌ 3 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌ ద్వారా వచ్చిన డబ్బును మధుసూదన్ సాయి గ్లోబల్ మిషన్‌ నిరుపేదల కోసం ఉపయోగించనుంది.

Show comments