NTV Telugu Site icon

Sachin Tendulkar: మీరు మా హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు.. ప్రీతి, నిషాద్‌లకు సచిన్ అభినందనలు

Sachin

Sachin

పారాలింపిక్స్ 2024లో పతకాలు సాధించిన ఆటగాళ్లను క్రికెట్ దిగ్గజం, టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అభినందించారు. ఆదివారం భారత ఆటగాళ్లు రెండు పతకాలు సాధించారు. భారత్‌కు హైజంప్‌లో ఒక పతకం, స్ప్రింట్‌లో ఒక పతకం లభించింది. దీంతో.. భారత్‌కు పతకాల సంఖ్య పెరిగింది. ఈ క్రమంలో.. సచిన్ టెండూల్కర్ స్పందిచారు. 2024 ఒలింపిక్ గేమ్స్‌లో పతకాలు గెలిచిన.. మంచి ప్రదర్శన చేసిన ఆటగాళ్లను ప్రశంసించారు.

Read Also: BSNL Recharge Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్ ప్లాన్.. తక్కువ ధరలో 160 రోజుల వ్యాలిడిటీ!

సచిన్ టెండూల్కర్ ‘X’లో పోస్ట్ చేస్తూ.. ‘ప్రీతీ పాల్, నిషాద్ పతకాలు సాధించడం ద్వారా సంఖ్యను పెంచారు. మీరిద్దరూ కలిసి కొత్త శిఖరాలను అధిరోహిస్తున్నారు. మా హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు”. అని పేర్కొన్నారు.

Read Also: NBK 50 in TFI: ఆయన కూడా వచ్చి ఉంటే ఫ్రేమ్ నిండుగా ఉండేది మాష్టారూ!!

పారాలింపిక్ గేమ్స్ 2024లో.. భారత్ ఇప్పటివరకు ఒక స్వర్ణం, రెండు రజతం.. 4 కాంస్య పతకాలను గెలుచుకుంది. పాయింట్ల పట్టికలో భారత్ 27వ స్థానంలో ఉంది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్ 1 ఈవెంట్‌లో అవని లేఖరా బంగారు పతకాన్ని గెలుచుకోగా, పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్ 1 ఈవెంట్‌లో మనీష్ నర్వాల్ రజత పతకాన్ని సాధిచాడు. 100 మీటర్లు, 200 మీటర్ల పరుగు పందెంలో ప్రీతీ పాల్ రెండు కాంస్య పతకాలు సాధించింది. షూటింగ్‌లో రుబీనా ఫ్రాన్సిస్, మోనా అగర్వాల్ కాంస్య పతకాలు సాధించారు. రానున్న రోజుల్లో భారత్‌కు మరికొన్ని పతకాలు వచ్చే అవకాశం ఉంది. కాగా.. భారత ఆటగాళ్లు ఇంతకుముందు కూడా పారా గేమ్స్‌లో రాణిస్తున్నారు.