Site icon NTV Telugu

Sachin Tendulkar: విరాట్ కోహ్లీ టెస్టు రిటైర్మెంట్ పై సచిన్ టెండూల్కర్ భావోద్వేకం..!

Sachin Ten

Sachin Ten

Sachin Tendulkar: టీమిండియా మాజీ కెప్టెన్ లలో ఒకరైన విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సందర్భంగా భారత క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఓ భావోద్వేగంతో కూడిన కథను సోషల్ మీడియా వేదికా గుర్తు చేసుకున్నారు. తన టెస్టు రిటైర్మెంట్ సందర్భంగా కోహ్లీ ఇచ్చిన ఒక విలువైన గిఫ్ట్ ప్రతిపాదనను గుర్తు చేసుకుంటూ, కోహ్లీకి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు.

Read Also: Bangladesh: షేక్ హసీనాకు బిగ్ షాక్.. యూనస్ ప్రభుత్వం అవామి లీగ్ పార్టీని అధికారికంగా నిషేధించింది

నేను నా చివరి టెస్టు ఆడుతున్నప్పుడు, నీవు నీ తండ్రి నుండి మిగిలిన ఒక థ్రెడ్‌ను నాకు అందించాలని అనుకున్నావు. అది ఎంతగా వ్యక్తిగతమో నాకు తెలుసు. అందుకే నేను ఆ గిఫ్ట్‌ను తీసుకోలేకపోయాను. కానీ నీ ఆలోచన, నీ ప్రేమ నన్ను ఎంతో భావోద్వేగానికి గురిచేసింది. ఆ గిఫ్ట్‌ను నేను స్వీకరించకపోయినా, నీ ఆ గుండెల్లోని ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను అంటూ సచిన్ తన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. నీ కోసం ఇవ్వదని ఎలాంటి థ్రెడ్‌ లేదు, కానీ.. నీవు నా లోతైన అభిమానాన్ని కలిగి ఉంటావని తెలిపారు. అలాగే నీవు టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు చెబుతున్న తరుణంలో, నీకు ఇవ్వడానికి నాకు థ్రెడ్‌ ఏమీ లేకపోయినా.. నా మనస్సుతో రాసిన అభినందనలు మాత్రం ఉన్నాయి.. నీవు ఎంతోమంది యువ క్రికెటర్లకు ప్రేరణగా నిలిచావు. అదే నిజమైన వారసత్వం అంటూ సచిన్ పేర్కొన్నారు. అలాగే నీవు భారత క్రికెట్‌కు కేవలం పరుగులు మాత్రమే ఇవ్వలేదు.. నీవు ఒక కొత్త తరం అభిమానులు, ఆటగాళ్లను అందించావు. ఇది నీ టెస్టు కెరీర్‌కు గొప్పతనాన్ని చాటుతుంది. నీ అద్భుతమైన టెస్టు కెరీర్‌కు అభినందనలు అంటూ సచిన్ తన పోస్ట్‌ను ముగించారు.

Read Also: RAPO 22 : ‘ఉపేంద్ర’ ఫస్ట్ లుక్ రిలీజ్

విరాట్ కోహ్లీ భారత్ తరపున 123 టెస్టు మ్యాచ్‌లు ఆడి, 46.85 సగటుతో మొత్తం 9,230 పరుగులు సాధించారు. ఇందులో 30 శతకాలు ఉన్నాయి. ఒక కెప్టెన్, ఆటగాడిగా కోహ్లీ భారత క్రికెట్‌కు కేవలం పరుగులే కాకుండా, క్రికెట్‌ను ప్రేమించే ఒక కొత్త తరం అభిమానులను, యువ క్రికెటర్లను అందించారు.

Exit mobile version