బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా అదరగొడుతోంది. ముఖ్యంగా బౌలింగ్‌లో స్పిన్నర్లు రవీంద్ర జడేజా ఐదు వికెట్లు, రవి అశ్విన్ మూడు వికెట్లతో ఆసీస్ బ్యాటర్ల నడ్డివిరిచారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 177 రన్స్‌కే ఆలౌటైంది. ఇక బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ (120) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ప్రత్యర్థి బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ సెంచరీతో మెరిశాడు. ఈ నేపథ్యంలో సచిన్ ఓ ట్వీట్ చేశాడు. ఆర్ఆర్ఆర్ వల్లే ఆసీస్‌పై భారత్ పైచేయి సాధించగలిగిందని తెలిపాడు. ఆ ఆర్ఆర్ఆర్ ఎవరో కాదు రోహిత్, రవీంద్ర జడేజా, రవి అశ్విన్. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.
𝐑𝐑𝐑 💥 🔥
The trio of Rohit, Ravindra & Ravichandran have helped India get ahead in this Test.@ImRo45 has led from the front with his 100 while @ashwinravi99 & @imjadeja have got us important breakthroughs.#INDvAUS pic.twitter.com/JTipYmxpKt
— Sachin Tendulkar (@sachin_rt) February 10, 2023
Also Read: Auto Ramprasad: ఆటో రామ్ ప్రసాద్ కు క్యాన్సర్.. క్లారిటీ ఇచ్చిన జబర్దస్త్ నటుడు
తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ తక్కువ స్కోర్‌కు ఆలౌటవడంలో జడేజా, అశ్విన్‌లది కీలకపాత్ర. 22 ఓవర్ల పాటు బౌలింగ్ చేసిన జడ్డూ 47 రన్స్ ఇచ్చి 5 వికెట్లు తీశాడు. టెస్టుల్లో ఐదు వికెట్లు తీయడం జడేజాకు ఇది 11వసారి. కొన్ని నెలలుగా గాయం కారణంగా ఆటకు దూరమైన ఇతడు.. రీఎంట్రీ తర్వాత ఆడిన తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్‌లోనే సూపర్ పెర్ఫమెన్స్ ఇవ్వడం గమనార్హం. ఇక అశ్విన్ 15.5 ఓవర్లపాటు బౌలింగ్ వేసి 3 వికెట్లు తీశాడు. అలాగే బ్యాటింగ్‌లో రోహిత్ సెంచరీతో మెరిశాడు. ఓ ఎండ్‌లో వరుస వికెట్లు పడుతున్నా తనదైన శైలి బ్యాటింగ్‌తో అదరగొట్టాడు.
Also Read: Kolagatla Veerabhadra: సీఎం జగన్ చెప్పినట్లు.. 175 స్థానాలకు 175 గెలిచి తీరుతాం