Sabarimala: శబరిమల భక్తులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. శబరిమల మండల మకరవిళక్కు తీర్థయాత్రలో భాగంగా, భక్తుల కోసం వర్చువల్ క్యూ బుకింగ్ శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతుంది. దర్శనం కోసం స్లాట్‌లను www.sabarimalaonline.org వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ప్రతిరోజూ 70,000 మంది భక్తులు వర్చువల్ క్యూ వెబ్‌సైట్ ద్వారా స్లాట్‌లను బుక్ చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. అదనంగా, వండిపెరియార్ సత్రం, ఎరుమేలి, నీలక్కల్, పంబ వద్ద రియల్ టైమ్ బుకింగ్ కేంద్రాలు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ గరిష్టంగా 20,000 మంది భక్తులు దర్శనం కోసం అనుమతి ఇస్తారు.
READ MORE: Visakhapatnam: లైంగిక వేధింపులతో డిగ్రీ స్టూడెంట్ మృతి.. విద్యార్థి సంఘాల ఆందోళన
అంతే కాదు.. ప్రయాణికుల ప్రమాద బీమా కవరేజీలో సైతం మార్పులు తీసుకువచ్చారు. గతేడాది యాత్రికులకు ప్రమాద బీమా కవరేజీ కేవలం నాలుగు జిల్లాలకే పరిమితం చేశారు. తాజాగా దాన్ని సవరించి ఈ తీర్థయాత్ర సీజన్ నుంచి శబరిమల ప్రయాణంలో కేరళలో ఎక్కడ ప్రమాదం జరిగిన రూ. 5 లక్షల వరకు కవరేజీ వర్తిస్తుంది. అంతేకాదు.. ప్రమాద వశాత్తు భక్తులు ఎవరైనా మరణిస్తే మృతదేహాలను ఇంటికి తరలించడానికి ఆర్థిక సాయం చేయనుంది. కేరళ లోపల అయితే అంబులెన్స్ ఖర్చుల కోసం రూ. 30,000, కేరళ వెలుపల రూ. 1 లక్ష వరకు అందించనున్నారు. అదనంగా శబరిమల విధుల్లో ఉన్న దేవస్వం బోర్డు శాశ్వత, రోజువారీ వేతన ఉద్యోగులకు, అలాగే ఇతర ప్రభుత్వ విభాగాల ఉద్యోగులకు సైతం బీమా కవరేజీ వర్తిస్తుంది.
READ MORE: Kottayam: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్.. దర్శనం కోసం వర్చువల్ క్యూ బుకింగ్…
గతంలో నీలక్కల్ నుంచి సన్నిధానం వరకు తీర్థయాత్ర మార్గంలో సంభవించే గుండెపోటు లేదా స్ట్రోక్స్ కారణంగా సంభవించే సహజ మరణాలకు పరిహారం ఉండేది కాదు. అయితే.. ఈ ఏడాది నుంచి సహజ మరణాలకు రూ. 3 లక్షల ఆర్థిక సహాయం అందించే యాత్రికుల సంక్షేమ నిధి ప్రారంభిస్తారు. ఇక్క ఓ ముఖ్యమైన విషయం గుర్తుచుకోవాలి.. బీమా కవరేజీ పొందడానికి వర్చువల్ క్యూ బుకింగ్ ఐడిని ప్రాథమిక పత్రంగా పరిగణిస్తారు కాబట్టి.. జాగ్రత్తగా ఉంచుకోవడం తప్పనిసరి.
