Pilgrims Wait For Hours At Sabarimala Due To Heavy Rush: కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమల దేవాలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ప్రస్తుతం శబరిమల భక్తుల తాకిడితో కిటకిటలాడుతోంది. కొండ మొత్తం అయ్యప్ప స్వామి నామస్మరణతో మార్మోగిపోతోంది. అయ్యప్ప స్వామిని దర్శించుకోవటానికి వస్తున్న భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. ఓ వైపు వర్షాలు, చలి పెడుతున్నా.. అయ్యప్ప భక్తులు మాత్రం స్వామిని దర్శనం చేసుకోవటానికి వెనకడుగు వేయడం లేదు. ప్రస్తుతం కేరళలో భక్తుల తాకిడి విపరీతంగా ఉంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, యూపీ నుంచి లక్షలాది మంది అయ్యప్ప దీక్షాపరులు, భక్తులు శబరిగిరులకు చేరుకుంటున్నారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎఎరుమేలికి 4 కిలోమీటర్ల ముందే వాహనాలు నిలిచిపోయాయి. దీంతో తెల్లవారుజామున 4 గంటల నుంచి భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ట్రాఫిక్ జామ్ దృష్ట్యా కొందరు ఎరుమేలి నుంచి శబరిమలకు పాదయాత్రగా వెళ్తున్నారు. స్వామి వారి దర్శనానికి గంటల తరబడి సమయం పడుతోంది.
Also Read: Ram Charan: క్రికెట్ లోకి అడుగుపెట్టిన గేమ్ ఛేంజర్… ఏకంగా టీమ్ కొనేసాడు
మాలధారణలో ఉన్న చిన్నారులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని.. పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో.. శబరిమల ఆలయానికి సంప్రదాయ అటవీ మార్గంలో వెళ్లేందుకు కేరళ ప్రభుత్వం సమయాన్ని పొడిగించింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు అనుమతిచ్చింది. ఈ సాంప్రదాయ అటవీ మార్గం ఎరుమేలి నుంచి పంపా వరకు ఉండగా.. ఎనిమిది గంటల ప్రయాణం ఉంటుంది.