NTV Telugu Site icon

Godavari Floods: గోదావరికి శబరిపోటు.. ప్రమాద హెచ్చరికలు జారీ

Shabari

Shabari

ఎగువన కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరికి భారీగా వరద వస్తుంది. అయితే గోదావరి వరద ఇంకా మొదటి ప్రమాద హెచ్చరిక రాకముందే శబరి నదికి కూడా భారీగా వరద రావడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఛత్తీస్ఘడ్-ఒరిస్సా రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల శబరి నదికి 28 అడుగులకి వరద చేరుకుంది. దీంతో.. గోదావరికి పోటు ఏర్పడుతుంది. గోదావరి నుంచి దిగువకి వెళ్లే నీటి వేగం స్తంభించింది. దీంతో ఇప్పటికే భారీ వర్షాలు వల్ల పలు ప్రాంతాల్లో వరద ప్రమాదం ఏర్పడింది. తెలంగాణ నుంచి ఆంధ్రా మీదుగా ఛత్తీస్ఘడ్-ఒరిస్సా వెళ్లే రహదారులు స్తంభించి పోయాయి.

Read Also: India-Pak: సరిహద్దుల్లో పాక్ దుశ్చర్య..ఫెన్సింగ్ కట్ చేసిన పాక్ పౌరులు

ఛత్తీస్ఘడ్, ఒరిస్సా రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఏపీలోని అల్లూరి జిల్లాలోని అనేక గ్రామాలకు ముంపు ఏర్పడింది. పలు గ్రామాలకు వెళ్లే రహదారులు స్తంభించాయి. అదేవిధంగా కొన్ని గ్రామాలకు చుట్టూ నీళ్లు చేరడంతో ప్రజలు ఇక్కట్లకు గురయ్యారు. ఈ నేపథ్యంలో వారందరికీ నేనున్నానంటూ.. రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష గ్రామ గ్రామాన తిరుగుతున్నది. గ్రామాల్లో వైద్య శిబిరాలు, లాంచీలను సిద్ధం చేసినట్లుగా ఎమ్మెల్యే శిరీష స్పష్టం చేశారు. తాను సొంత వాహనాలని బాధిత కుటుంబాల వారి కోసం ఏర్పాట్లు చేసినట్లుగా చెప్తున్నారు.

Read Also: Panipuri: ఇందుకే కాబోలు.. అమ్మాయిలు పానీపూరి లొట్టలేసుకుంటూ తినేస్తారు..