Site icon NTV Telugu

South Africa: ఇదేం కొట్టుడు సామీ.. ఏకంగా 50 ఓవర్లలో 416 పరుగులు చేశారు..

South Africa

South Africa

వన్డే క్రికెట్‌ చరిత్రలో సౌతాఫ్రికా జట్టు విధ్వంసం సృష్టిచింది. సెంచూరియన్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న కీలకమైన నాలుగో వన్డేలో దక్షిణాఫ్రికా ప్లేయర్ హెన్రిచ్‌ క్లాసెన్‌ మహోగ్రరూపం దాల్చాడు. కేవలం 83 బంతుల్లో 13 ఫోర్లు, 13 సిక్సర్ల సాయంతో 174 రన్స్ చేశాడు. క్లాసెన్‌కు ముందు రస్సీ వాన్‌ డర్‌ డస్సెన్‌ (65 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 62 పరుగులు), ఆఖర్లో డేవిడ్‌ మిల్లర్‌ (45 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 82 నాటౌట్‌) తోడవ్వడంతో దక్షిణ ఆఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టాని​కి 416 పరుగులు చేసింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ మార్క్రమ్‌ (8) మినహా అందరూ భారీగా పరుగులు చేశారు. క్వింటన్‌ డికాక్‌ (45), రీజా హెండ్రిక్స్‌ (28) ఓ మోస్తరు స్కోర్లు నమోదు చేశారు.

Read Also: Mouni roy: అది నడుమా నయాగరానా…? ఒళ్లు విల్లులా వంచిన మౌని రాయ్

ఈ సిరీస్‌లో నిలబడాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా ప్లేయర్ హెన్రిచ్‌ క్లాసెన్‌ మహోగ్రరూపం దాల్చాడు. కేవలం 57 బంతుల్లో శతకంతో రెచ్చిపోయాడు. వన్డే క్రికెట్‌ చరిత్రలో ఇది ఐదో వేగవంతమైన సెంచరీ. గతంలో క్లాసెన్‌ ఓసారి 54 బంతుల్లోనే శతకం కొట్టాడు. వన్డేల్లో ఫాస్టెస్ట్‌ హండ్రెడ్‌ రికార్డు ఏబీ డివిలియర్స్‌ పేరిట ఉంది. ఈ మ్యాచ్‌లో క్లాసెన్‌ ఆడిన ఇన్నింగ్స్‌ వన్డే క్రికెట్‌ చరిత్రలో నిలిచిపోతుంది. క్లాసెన్‌కు మిల్లర్‌ కూడా జతకావడంతో ఆసీస్‌ బౌలింగ్‌ను చీల్చి చెండాడు. వీరిద్దరి ధాటికి ఆసీస్‌ స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా 10 ఓవర్లలో 113 పరుగులు సమర్పించుకున్నాడు.

Read Also: Deepika Padukone: ఫ్రెండ్ షిప్ అంటే దీపికాదే.. షారుఖ్ కోసం ఆ పని చేసి..?

జంపాతో పాటు స్టొయినిస్‌, హాజిల్‌వుడ్‌, నాథన్‌ ఇల్లిస్‌, మైఖేల్‌ నెసర్‌ ధారాళంగా రన్స్ ఇచ్చారు. కాగా, 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ప్రస్తుతం ఆసీస్‌ 2-1 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సౌతాఫ్రికా సిరీస్‌ ఆవకాశాలు సజీవంగా ఉంచుకుంటుంది. ఈ ఇన్నింగ్స్‌లో క్లాసెన్‌ ఆఖరి 150 పరుగులను కేవలం 58 బంతుల్లో చేయడం విశేషం.. క్లాసెన్‌-మిల్లర్‌ జోడీ కేవలం 94 బంతుల్లో 222 పరుగులు జోడించారు. క్రికెట్‌ చరిత్రలో ఇదే ఫాస్టెస్ట్‌ డబుల్‌ సెంచరీ భాగస్వామ్యంగా నిలిచింది. ఆస్ట్రేలియాపై రెండో ఫాస్టెస్ట్‌ సెంచరీ.. కోహ్లీ 52 బంతుల్లో ఆసీస్‌పై శతక్కొట్టాడు. వన్డేల్లో అత్యధిక రన్స్ ఇచ్చిన బౌలర్‌గా ఆడమ్ జంపా.. ఆసీస్‌కే చెందిన మిక్‌ లెవిస్‌ (113) రికార్డును సమం చేశాడు.

Exit mobile version