NTV Telugu Site icon

MS Dhoni-CSK: ఎంఎస్ ధోనీని వద్దనుకున్న సీఎస్‌కే!

Ms Dhoni

Ms Dhoni

S Badrinath About MS Dhoni: ఐపీఎల్ ఆరంభం నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌ (సీఎస్‌కే) జట్టుకే టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆడుతున్నాడు. తన అద్భుత కెప్టెన్సీ, బ్యాటింగ్‌తో సీఎస్‌కేకు ఏకంగా ఐదు ట్రోఫీలు అందించాడు. సీఎస్‌కే అంతలా సక్సెస్ అవ్వడానికి కారణం మిస్టర్ కూల్‌ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ధోనీ లేకుండా చెన్నై జట్టుని ఊహించలేం. అయితే ఒకానొక సందర్భంలో దిగ్గజ ధోనీనే సీఎస్‌కే మేనేజ్మెంట్ వద్దనుకుందట. ఈ విషయాన్ని భారత మాజీ ఆటగాడు ఎస్‌ బద్రీనాథ్‌ చెప్పాడు.

ఓ స్పోర్ట్స్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎస్‌ బద్రీనాథ్‌ మాట్లాడుతూ… ‘2008 ఐపీఎల్ వేలం జరుగుతున్న సమయంలో ఎంఎస్ ధోనీని కాకుండా వీరేంద్ర సెహ్వాగ్‌ని తీసుకోవాలని సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌ అనుకుంది. అప్పటికే ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ అతడితో ఒప్పందం కుదుర్చుకుంది. చెన్నై జట్టు కూర్పులో భారత మాజీ ఆటగాడు వీబీ చంద్రశేఖర్‌ కీలక పాత్ర పోషించాడు. ధోనీ చెన్నై జట్టులోకి రావడానికి ముఖ్య కారణం చంద్రశేఖరే. దిగ్గజ సారథిని ఇచ్చిన ఆయనకు నేను కృతజ్ఞుడిని’ అని చెప్పాడు.

Also Read: Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌పై ప్రశ్న.. 1.60 లక్షలు గెలుచుకున్న కంటెస్టెంట్‌!

ఎంఎస్ ధోనీ సారథ్యంలో ఎస్‌ బద్రీనాథ్‌ ఆడిన విషయం తెలిసిందే. భారత జట్టు తరఫున మాత్రమే కాదు.. సీఎస్‌కేలో కూడా బద్రీనాథ్‌ ఆడాడు. ఐపీఎల్‌ 2024 సీజన్‌లో ధోనీ మెరుపు ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. భారీ సిక్సులతో అభిమానులను అలరించాడు. అయితే ఐపీఎల్‌ 2025లో అతడు ఆడతాడా? లేదా? అనేది పెద్ద ప్రశ్న. మహీ షాకులిస్తాడన్న విషయం తెలిసిందే. ముందస్తు సమాచారం ఇవ్వకుండా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.

Show comments