NTV Telugu Site icon

RX 100 : మరోసారి రిపీట్ కానున్న ఆ సూపర్ హిట్ కాంబో..?

Whatsapp Image 2023 11 20 At 7.04.01 Pm

Whatsapp Image 2023 11 20 At 7.04.01 Pm

ఆర్‌ఎక్స్‌ 100′ సినిమా తో దర్శకుడు అజయ్ భూపతి టాలీవుడ్‌లో ఓ ట్రెండ్‌ సెట్‌ చేసారు.. యంగ్ హీరో కార్తికేయ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా అద్భుత విజయాన్ని సాధించింది. దర్శకుడి గా అజయ్‌ భూపతి కి ఆర్ ఎక్స్ 100 మూవీ తొలి చిత్రం. దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ శిష్యుడైన అజయ్ తన జీవితంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమా ను తెరకెక్కించారు. బోల్డ్ కంటెంట్ తో వచ్చిన ‘ఆర్‌ఎక్స్‌ 100’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది..దాదాపు ఈ సినిమాలో నటించిన అందరికీ మంచి పేరు వచ్చింది.. ఈ సినిమా తో హీరో కార్తికేయకి కూడా వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి.. కానీ ఈ యంగ్ హీరో మళ్లీ ‘ఆర్‌ఎక్స్‌ 100’వంటి భారీ విజయాన్ని మాత్రం అందుకోలేకపోయాడు. కాగా ఇప్పుడీ కాంబినేషన్ మరో సారి రిపీట్ కాబోతుందని తెలుస్తోంది.

ఇటివలే మంగళవారం అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అజయ్ భూపతి.ఇంత వరకు ఎవరూ టచ్ చేయని విభిన్న కాన్సెప్ట్ తో మంగళవారం సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ట్రైలర్ సినిమాపై చాలా ఆసక్తిని పెంచడంతో బిజినెస్ కూడా బాగానే జరిగింది.రీసెంట్ గా విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ రెస్పాన్స్ ను అందుకుంది.మహాసముద్రం లాంటి ఫ్లాఫ్ తర్వాత మంగళవారం ఫలితం అజయ్ భూపతి మంగళవారం సినిమా తో మంచి విజయం అందుకున్నాడు..ఇప్పుడు మరోసారి కార్తికేయ తో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడటా.. ఈసారి రాయలసీమ బ్యాక్ డ్రాప్‌ లో ఓ యాక్షన్ డ్రామాని సెట్ చేశాడని తెలుస్తుంది..త్వరలోనే ఈ సినిమా కు సంబంధించి మేకర్స్ పూర్తి వివరాలు తెలియజేయనున్నారు..ఇటీవలే కార్తికేయ ‘బెదురులంక 2012’ సినిమా తో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.. ఈ సినిమా మంచి విజయం అందుకుంది.. ఈ సినిమాలో కార్తికేయ సరసన నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది..

Show comments