Russia Nuclear Drills: నాలుగు సంవత్సరాలు కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై చర్చించడానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ – అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హంగేరీలో సమావేశం కావాల్సి ఉంది. కానీ శిఖరాగ్ర సమావేశంపై ప్రస్తుతం అనిశ్చితి ఏర్పడింది. దీంతో బుధవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దేశ వ్యూహాత్మక అణ్వాయుధ దళాల ప్రధాన విన్యాసాన్ని పర్యవేక్షించారు.
READ ALSO: Mosquito Free Country: ఇక్కడ ఒక్క దోమ కూడా ఉండదు! ప్రపంచంలో దోమలు లేని ఏకైక దేశం ఏంటో తెలుసా?
అణు ప్రయోగాలకు షెడ్యూల్..
రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతూ.. ” ఈ రోజు మన వ్యూహాత్మక అణు శక్తులను నిర్వహించడానికి టైం షెడ్యూల్ చేశాం” అని వెల్లడించారు. ఈ పరీక్షల్లో భూమి, సముద్రం, వాయు ఆధారిత వ్యూహాత్మక అణు శక్తులు పాల్గొన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ విన్యాసంలో ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు, వాయు ఆధారిత క్రూయిజ్ క్షిపణుల ఆచరణాత్మక ప్రయోగాలు చేయనున్నట్లు రష్యా వెల్లడించింది. యార్స్ ICBM లాంచర్, నార్తర్న్ ఫ్లీట్ అణుశక్తితో నడిచే జలాంతర్గామి బ్రయాన్స్క్, Tu-95MS వ్యూహాత్మక బాంబర్ పాల్గొనున్నాయి.
బుడాపెస్ట్‌లో ట్రంప్ – పుతిన్ మీటింగ్ ఉంటుందా?
హంగేరియన్ రాజధాని బుడాపెస్ట్‌లో పుతిన్ – ట్రంప్ మధ్య జరగాల్సిన చర్చలు వాయిదా పడ్డాయనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ పుకార్లను తప్పుదారి పట్టించేవిగా క్రెమ్లిన్ తోసిపుచ్చింది. “ఇప్పటివరకు కొత్త సమాచారం లేదు. చాలా చర్చలు పుకార్లపై ఆధారపడి ఉన్నాయి” అని రష్యా ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ అన్నారు. ఇదిలా ఉండగా ఈ విషయంపై రాబోయే కొద్ది రోజుల్లో నిర్ణయం తీసుకోవచ్చని ట్రంప్ చెబుతున్నారు. పలు నివేదిక ప్రకారం.. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ – అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో మధ్య జరగాల్సిన సమావేశం నిరవధికంగా వాయిదా పడిందని వెల్లడైంది.
రష్యా ఉప విదేశాంగ మంత్రి సెర్గీ ర్యాబ్కోవ్ మీడియాతో మాట్లాడుతూ.. “శిఖరాగ్ర సమావేశానికి సన్నాహాలు కొనసాగుతున్నాయి, ఇవి వివిధ రూపాల్లో ఉండవచ్చు” అని చెప్పారు. “మాకు సూచించినట్లుగా, మేము ప్రధాన అంశాలపై దృష్టి పెడుతున్నాము” అని ఆయన పేర్కొన్నారు. రష్యన్ వర్గాల సమాచారం ప్రకారం.. కాల్పుల విరమణకు పరిమితమైన పరిష్కారానికి మాస్కో అంగీకరించదు. అలాగే నాటో తన డిసెంబర్ 2021 భద్రతా డిమాండ్లను విస్మరించిందని మాస్కో పేర్కొంది.
READ ALSO: Gummadi Narsaiah Biopic : గుమ్మడి నర్సయ్యగా శివ రాజ్ కుమార్
